ETV Bharat / state

'కొవిడ్​ కట్టడి కోసం ప్రతిఒక్కరికి టీకా అవసరమే' - తెలంగాణ వార్తలు

కొవిడ్‌ కట్టడిపై 3 వారాల కిందట వర్చువల్‌ విధానంలో విస్తృత ప్రచారానికి ఏఐజీ ఆసుపత్రి తెరలేపింది. కొవిడ్‌ను కట్టడి చేయడానికి టీకా కచ్చితంగా ఉపయోగపడుతుందని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ) ఛైర్మన్‌, ప్రఖ్యాత జీర్ణకోశ వ్యాధుల నిపుణులు డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు.

'కొవిడ్​ కట్టడి కోసం ప్రతిఒక్కరికి టీకా అవసరమే'

author img

By

Published : Jan 4, 2021, 6:55 AM IST

కొవిడ్‌ను కట్టడి చేయడానికి టీకా కచ్చితంగా ఉపయోగపడుతుందని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ) ఛైర్మన్‌, ప్రఖ్యాత జీర్ణకోశ వ్యాధుల నిపుణులు డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ టీకాను తీసుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా 50 ఏళ్లు పైబడినవారు, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నవారు తప్పనిసరిగా వ్యాక్సిన్‌ను వేయించుకోవాలని సూచించారు.

విస్తృత ప్రచారం...

కొవిడ్‌ కట్టడిపై 3 వారాల కిందట వర్చువల్‌ విధానంలో విస్తృత ప్రచారానికి ఏఐజీ ఆసుపత్రి తెరలేపింది. కరోనా టీకా ప్రాధాన్యంపైనా ఇందులో విశేషంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటులు చిరంజీవి, మహేశ్‌బాబు సహా 10 వేల మంది నమోదు చేసుకున్నారు.

ఈ ప్రచార పర్వం ముగింపు వర్చువల్‌ సదస్సును ఆదివారం నిర్వహించారు. ఇందులో ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్యకార్యదర్శి ఎస్‌.నర్సింగరావు, డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి, వాణిజ్యవేత్తలు, బీవీఆర్‌ మోహన్‌రెడ్డి, బి.పార్థసారథిరెడ్డి, సి.కృష్ణప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

‘ప్రపంచవ్యాప్తంగా 8.3 కోట్ల మందిని వైరస్‌ ప్రభావితం చేసింది. 18.3 లక్షల మందికి పైగా కన్నుమూశారు. ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఇంతటి వినాశనంలోనూ ఊరటనిచ్చేది.. ప్రపంచమంతా ఒక్కటై కొవిడ్‌పై పోరును కొనసాగించడమే. చిన్నాపెద్దా సహా అన్ని దేశాల శాస్త్రవేత్తలు కరోనా వైరస్‌ టీకాపై ప్రయోగాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కొన్ని కొవిడ్‌ టీకాలు అందుబాటులోకి రావడం సంతోషాన్నిచ్చేదే. ఈ విజయంలో భాగస్తులైన ప్రతి ఒక్కరికి నా అభినందనలు. కొవిడ్‌ టీకా ఏదైనా ఎంతకాలం పనిచేస్తుందనేది స్పష్టంగా తెలియదు. టీకా సురక్షితంపై అన్ని జాగ్రత్తలు తీసుకొనే రూపొందించారని నేను విశ్వసిస్తున్నాను. అధిక రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బులు, మూత్రపిండాలు, కాలేయ, ఊపిరితిత్తుల సమస్యలు తదితర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా కొవిడ్‌ టీకాను తీసుకోవాలని వివరించారు.

-- డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి, ఏఐజీ ఛైర్మన్‌

ఇదీ చదవండి: కొవాగ్జిన్​కు డీసీజీఐ గ్రీన్​సిగ్నల్.. త్వరలోనే పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.