కేంద్ర ప్రభుత్వం మహిళల సంరక్షణ పట్ల అనుసరిస్తున్న విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య ప్రతినిధులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య జాతీయ మహాసభలు మూడురోజుల పాటు జరిగాయి. దేశవ్యాప్తంగా మహిళలకు రక్షణ కరువైందని... ప్రభుత్వాలు మారుతున్నా మహిళల రక్షణ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మహిళా సమాఖ్య జాతీయ నాయకురాలు నీలం కుమారి ఆరోపించారు.
ఈ మహాసభల్లో మహిళలపై జరుగుతున్న దాడులపై చర్చ జరిగిందని ఆమె వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలను చైతన్య పరచడానికి నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి: జూబ్లీ చెక్‌పోస్ట్ వద్ద జేపీకి తప్పిన ప్రమాదం