ETV Bharat / state

'ఏఐసీసీ ఆదేశాల మేరకు గ్రామీణ స్థాయి నుంచి పోరాటాలు'

కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుల విషయంలో కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామీణ స్థాయి నుంచి పోరాటం చేయాలని దిశానిర్దేశం చేశారు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మనిక్కమ్ ఠాగూర్.

author img

By

Published : Sep 22, 2020, 9:55 PM IST

'ఏఐసీసీ ఆదేశాల మేరకు గ్రామీణ స్థాయి నుంచి పోరాటాలు'
'ఏఐసీసీ ఆదేశాల మేరకు గ్రామీణ స్థాయి నుంచి పోరాటాలు'

భాజపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుల విషయంలో ఏఐసీసీ ఆదేశాల మేరకు గ్రామీణ స్థాయి నుంచి పోరాటాలు చేయాలని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మనిక్కమ్ ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిలు డీసీసీలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని డీసీసీ అధ్యక్షులతో ఇవాళ జూమ్ యాప్ ద్వారా జరిగిన సమావేశంలో ఎంపీ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్, పీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డిలతో పాటు పలువురు పాల్గొన్నారు.

డీసీసీ అధ్యక్షులను ఏఐసీసీ ఇంఛార్జి ఠాగూర్‌కు పరిచయం చేసిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి... రాబోయే దుబ్బాక ఉపఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్‌ల ఎన్నికలు, పార్టీ సభ్యత్వ నమోదు, మండలి ఎన్నికలు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని డీసీసీ అధ్యక్షులు కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. డీసీసీలకు దిశానిర్దేశం చేసిన ఏఐసీసీ ఇంఛార్జి ఠాగూర్‌... పార్టీకి డీసీసీ అధ్యక్షులు మూల స్తంభాల్లాంటి వారని కొనియాడారు. పట్టభద్రుల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పట్టణాలు, మండలాల్లో గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా చేర్పించేందుకు డీసీసీలు కృషి చేయాలన్నారు.

ఇదీ చూడండి: పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియ ప్రారంభించిన ఈసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.