బీసీ కమిషన్ ఛైర్మన్, సభ్యుల నియామకం చేపట్టాలని సీఎం కేసీఆర్కు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ లేఖ రాశారు. అక్టోబర్ 26, 2019న నాటికే కాలపరిమితి ముగిసినా రాజ్యాంగబద్ధమైన కమిషన్ పునరుద్ధరనలో అలసత్వం ఎందుకని ప్రశ్నించారు. దేశంలో కేవలం తెలంగాణలో మాత్రమే రాజ్యాంగ సవరణలను బేఖాతరు చేశారని విమర్శించారు.
2017లో 123 రాజ్యాంగ సవరణ, 2018లో 102 రాజ్యాంగ సవరణలను ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు చట్టాలుగా చేశాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో బీసీలకు రాజ్యాంగ బద్ధమైన కమిషన్ లేకపోవడం వల్ల తీరని అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే బడ్జెట్ సమావేశల్లో ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టి బీసీ కమిషన్ను ఏర్పాటుకు కృషిచేయాలని కోరారు.
ఇదీ చూడండి: పోరాట యోధుడిగా, పాలకుడిగా.. కేసీఆర్ 'ఒక్కగానొక్కడు'