ఐటీఐఆర్‌కు కేంద్రం నిధులు కేటాయించలేదని మంత్రి కేటీఆర్ అబద్ధం చెబుతున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. పొన్నాల లక్ష్మయ్య ఐటీ మంత్రిగా ఉన్నప్పుడే ఐటీఐఆర్‌కు 50 వేల ఎకరాల భూమి కేటాయించారని తెలిపారు. మంత్రి కేటీఆర్ వ్యవహార శైలి చూస్తే నవ్వొస్తుందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు.
కవిత ఓడిపోతే.. ఎమ్మెల్సీ పదవి ఇచ్చే వరకు నిద్రపోలేదని శ్రవణ్ ఆరోపించారు. కొత్త జిల్లాలు, కొత్త మండలాలు ఏర్పాటు చేశాక.. ఖాళీ ఏర్పడిన ఉద్యోగాలెన్ని అని ఆయన నిలదీశారు. ఈ సందర్భంగా బిశ్వాల్ కమిటీ 1.91 లక్షల ఖాళీలున్నాయని తెలిపిందని గుర్తు చేశారు. పీఆర్సీ విషయంలోనూ సర్కార్ ఉద్యోగులను మోసం చేస్తోందని ఆరోపించిన శ్రవణ్.. ఉద్యోగాల భర్తీపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
ఇదీ చూడండి: వర్చువల్ విధానంలో గవర్నర్ తమిళిసై అపాయింట్‌మెంట్లు