ETV Bharat / state

జీహెచ్ఎంసీ ఎన్నికలు ఆపాలన్న పిల్‌పై హైకోర్టు ఆగ్రహం - జీహెచ్​ఎంసీ ఎన్నికలపై పిటిషన్​

ts high court
ts high court
author img

By

Published : Nov 16, 2020, 3:34 PM IST

Updated : Nov 16, 2020, 5:25 PM IST

15:32 November 16

జీహెచ్ఎంసీ ఎన్నికలు ఆపాలన్న పిల్‌పై హైకోర్టు ఆగ్రహం

బీసీ రిజర్వేషన్ల వివాదాన్ని పరిగణనలో తీసుకొని జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియపై స్టే ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారంటూ ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం అత్యవసర విచారణ చేపట్టింది. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు 2010, 2012లో ఇచ్చిన తీర్పులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని దాసోజు శ్రవణ్ కుమార్ తరఫు న్యాయవాది వాదించారు.  

శ్రవణ్​పై ధర్మాసనం ఆగ్రహం

రాజకీయంగా వెనకబడిన వర్గాలు, విద్యాపరంగా బీసీలు వేర్వేరని సుప్రీంకోర్టు పేర్కొందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం రాజకీయంగా వెనకబడిన వర్గాలను గుర్తించే ప్రక్రియ చేపట్టకుండా.. విద్యారంగానికి చెందిన బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తోందన్నారు. అత్యంత వెనకబడిన వర్గాలకు రాజకీయ ప్రాతినిథ్యం లభించడం లేదన్నారు. పిల్ దాఖలు చేసిన దాసోజు శ్రవణ్ కుమార్​పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ దురుద్దేశాలతోనే ఎన్నికల షెడ్యూలు జారీ అయ్యే చివరి క్షణంలో వ్యాజ్యం దాఖలు చేశారని వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు పదేళ్ల క్రితం తీర్పు ఇస్తే ఇప్పటి వరకు ఏం చేశారని ప్రశ్నించింది.  

ఇప్పటివరకు ఏం చేశారు

ఎంబీసీలపై ప్రేమ ఉంటే ఇప్పటి వరకు ఏం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికలు ఆపే రాజకీయ వ్యూహంతో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసినట్లు కనిపిస్తోందని అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని పేర్కొంది. ఇదే అంశంపై 2015, 2016లో దాఖలైన రెండు పిటిషన్లతో కలిపి విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. అయితే తుది తీర్పునకు లోబడి ఉండేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.  

స్టేకు నిరాకరణ

నిరాకరించిన ధర్మాసనం ఎలాంటి స్టే ఉత్తర్వులు ఇవ్వమని స్పష్టం చేసింది. భవిష్యత్తు ఎన్నికలకు ఉపయోగపడేలా విచారణ జరుపుతామన్న హైకోర్టు.. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీకి నోటీసులు జారీ చేసింది. గతంలో దాఖలైన పిటిషన్లతో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది.

ఇదీ చదవండి: నాజల్ డ్రాప్​ వ్యాక్సిన్​పై కృషి చేస్తున్నాం: భారత్ బయోటెక్

Last Updated : Nov 16, 2020, 5:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.