ప్రజలకు ఏ మాత్రం వెసులుబాటు కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా ప్రకటించిన లాక్డౌన్తో వలస కార్మికులు, చిన్న, సూక్ష్మ పరిశ్రమదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా సామాజిక మాద్యమాల ద్వారా చేపట్టిన ఆన్‌లైన్ పోరాటంలో బాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను దాసోజ్ శ్రావణ్ ఎండగట్టారు.
ముందుచూపు లేకుండా విధించిన లాక్డౌన్తో పేదల ప్రజలు, రోజువారి కూలీలు, ఎమ్ఎస్ఎమ్ఈ సెక్టార్లో పనిచేసే కార్మికులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. వలసకార్మికులను వారి స్వగ్రామాలకు వెళ్లేందుకు అవసరమైన రవాణా సౌకర్యం కల్పించాలి. ఆదాయపు పన్ను పరిధిలో లేని పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలి. ఎంజీఎన్‌ఆర్‌జీ కింద రెండు వందల రోజులు పని కల్పించాలి. -ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్
ఇదీ చూడండి: మిడతలపై పోరులో.. మోగిన సైరన్లు, ఎగిరిన డ్రోన్లు!