ETV Bharat / state

'విశ్వ విద్యాలయాలు నిర్వీర్యం కాకుండా కాపాడాలి' - విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామకాల ఆలస్యం

ఉస్మానియా టీచింగ్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామకాల ఆలస్యం అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ పాల్గొని ప్రసంగించారు. తక్షణమే వీసీ నియామకాలు చేపట్టడానికి గవర్నర్ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Aicc Spokes Person dasoju sravan participated in a round table meeting on the issue of delay in appointments of vc
'విశ్వ విద్యాలయాలు నిర్వీర్యం కాకుండా కాపాడాలి'
author img

By

Published : Jan 12, 2021, 9:47 AM IST

రాష్ట్రంలో ఉపకులపతుల నియామకాల్లో గవర్నర్ జోక్యం చేసుకొని విశ్వ విద్యాలయాలు నిర్వీర్యం కాకుండా కాపాడాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ కోరారు. తక్షణమే వీసీ నియామకాలు చేపట్టడానికి చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ టీచింగ్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగించిన దాసోజు.. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. డెబ్భైవేల పుస్తకాలు చదివిన ముఖ్యమంత్రికి విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమించాలనే జ్ఞానం లేదని విమర్శించారు. తెలంగాణలో ప్రజల సమస్యలు వినే వారే లేరని.. ప్రజల వేదన అరణ్య రోదనే అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఉస్మానియాలో 848 ఖాళీలు, కాకతీయలో 295, తెలంగాణ యూనివర్సిటీలో 75, మహాత్మాగాంధీలో 115, శాతవాహన లో 110, పాలమూరులో 130, పొట్టిశ్రీరాములు యూనిర్సిటీలో 97, జేఎన్టీయూహెచ్​లో 232 ఖాళీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 4,000, ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలో 1650, ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 5,154 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.

ఖాళీలు భర్తీ చేయడంలో ఎందుకు కాలయాపన చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గవర్నర్ కలుగజేసుకొని వెంటనే నియామకాలు చేపట్టాలని దాసోజు శ్రవణ్ కోరారు.

ఇదీ చూడండి: గవర్నర్​ను కలవనున్న భాజపా ప్రతినిధుల బృందం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.