ఏఐసీసీ(Aicc) కార్యదర్శి సంపత్‌కుమార్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏడేళ్లుగా ధరలు పెంచడం తప్ప ఏం చేయడం లేదని ఎద్దేవా చేశారు. దేశం అభివృద్ధి పథంలో పయనించి ప్రపంచంలోనే ఒక ఆదర్శవంతమైన దేశంగా ఎదిగినా... నరేంద్ర మోదీ పాలనలో ఒక పేద దేశంగా మారిందని ఆయన విమర్శించారు.
పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితి నానాటికి దిగజారి పోతోందని విమర్శించారు. ఇచ్చిన హామీలల్లో ఒకటి కూడా మోదీ అమలు చేయలేదని పేర్కొన్నారు. కేవలం మతాన్ని రెచ్చగొట్టి, జాతి, దేశం అంటూ గొప్పలు చెప్పుకుని ప్రజలు చీల్చి రాజకీయ లబ్ధి పొందుతున్నారని ఆరోపించారు. దేశ ప్రజలకు అవసరమైన ఉద్యోగ, ఉపాధి కల్పన, ఆర్థిక స్వావలంబన భద్రత లాంటివి నరేంద్ర మోదీ చేపట్టలేకపోయారని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: 'రుతుపవనాల రాక రెండు రోజులు ఆలస్యం'