ETV Bharat / state

'ఎస్సీ, ఎస్టీ హక్కులను కాలరాయడానికి కేంద్రం యత్నిస్తోంది' - ts news

కేంద్ర ప్రభుత్వంపై ఏఐసీసీ కార్యదర్శి సంపత్​ కుమార్​ ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ హక్కులను కాలరాయడానికి కేంద్రం యత్నిస్తోందని ఆరోపించారు. ఈ నెల 16, 17న నిరసన చేపట్టాలని యోచిస్తున్నట్లు వివరించారు.

aicc secretary sampath kumar comments on central government
'ఎస్సీ, ఎస్టీ హక్కులను కాలరాయడానికి కేంద్రం యత్నిస్తోంది'
author img

By

Published : Feb 11, 2020, 8:46 PM IST

ఎస్సీ, ఎస్టీలకు అంబేడ్కర్‌ ఇచ్చిన హక్కులను కాలరాయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ ఆరోపించారు. ఆర్​ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలను అమలు చేస్తున్న భాజపా... అంబేడ్కర్‌ విధానాలకు స్వస్తి పలకాలని చూస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలనేది ప్రాథమిక హక్కు కాదని కేంద్రం చెప్పడం సరికాదన్నారు. రిజర్వేషన్ల సవరణ చెల్లుబాటు అవుతుందని చెప్పడం అంటే బడుగు, బలహీన వర్గాలపై కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరించడమేనని ఆరోపించారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ సెల్స్‌ ఆధ్వర్యంలో చేపట్టనున్న కార్యాచరణపై చర్చించినట్లు వివరించారు. ఈ నెల 16,17 తేదీల్లో కాంగ్రెస్​ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయాలని యోచిస్తున్నట్లు ఆయన వివరించారు.

'ఎస్సీ, ఎస్టీ హక్కులను కాలరాయడానికి కేంద్రం యత్నిస్తోంది'

ఇవీ చూడండి: 'తెలంగాణలో సాధారణ వర్షపాతం కంటే 14శాతం అధికం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.