ఫార్మా హబ్‌గా పేరొందిన హైదరాబాద్‌లో వ్యాక్సిన్, రెమెడెసివర్ ప్రజలకు దొరకడం లేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. నిన్నటి వరకు ఏవైనా ఇబ్బందులు ఉంటే.. ఆరోగ్య శాఖ మంత్రి ఈటలకు చెప్పుకునే వాళ్లమని... ఇప్పుడు ఎవరికి చెప్పు కోవాలో తెలియని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.
కరోనా ఉద్ధృతి అధికమై అల్లకల్లోలంగా ఉన్న ఈ పరిస్థితుల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటలను తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రులు కరోనా రోగులను నిలువు దోపిడి చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. అవసరమైతే ఆ దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు ఆర్మీ సహాయం తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రజలకు తక్షణమే వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చుతామని చెప్పి ఆరు నెలలు అవుతున్నా... ఇంత వరకు అతీగతి లేదని ఎద్దేవా చేశారు.
ఇదీ చూడండి: దరఖాస్తు చేసుకున్న వారికే టీకా: డీఎంహెచ్ఓ సుజాత