ETV Bharat / state

AICC Focus on Telangana Elections 2023 : టీ-కాంగ్రెస్​లో అసమ్మతికి చెక్.. ఆ నేతలను గాడిలో పెట్టేందుకు రంగంలోకి AICC! - hyderabad news

AICC Focus on Telangana Elections 2023 : తెలంగాణ కాంగ్రెస్‌లో అసమ్మతికి చికిత్స చేసేందుకు ఏఐసీసీ నేరుగా రంగంలోకి దిగింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నాయకుల మధ్య విబేధాలు లేకుండా చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డితో అంటీ ముట్టనట్లు ఉంటూ వచ్చిన ఉత్తమ్‌కుమార్​రెడ్డి, దామోదర్‌ రాజనర్సింహ, జగ్గారెడ్డిలను గాడిలో పెట్టడంలో ఏఐసీసీ సఫలీకృతమైంది. నాయకులంతా ఏకతాటిపై ఉన్నారన్న సంకేతాలను జనంలోకి తీసుకెళ్లే రీతిలో పార్టీ కార్యక్రమాలు ఉండాలని పీసీసీకి ఏఐసీసీ స్పష్టం చేసింది.

Telangana Congress Assembly Elections
Telangana Congress Plans Assembly Elections
author img

By

Published : Aug 21, 2023, 9:20 AM IST

T Congress AICC Treatment For Unsatisfied Leaders రాష్ట్ర కాంగ్రెస్‌లో అసమ్మతికి చెక్‌పెట్టేలా రంగంలోకి ఏఐసీసీ

AICC Focus on Telangana Elections 2023 : రాష్ట్ర కాంగ్రెస్​లో ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. కానీ నాయకుల మధ్య విబేధాలు ఉండడంతో అంతా ఒకచోట కూర్చొని స్వేచ్ఛగా మాట్లాడుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్‌ రాజనర్సింహలతో పాటు పలువురు ముఖ్య నాయకులు పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి(TPCC President Revanth Reddy)తో అంటీ ముట్టనట్లు ఉంటూవచ్చారు. ఆ ముగ్గురు పార్టీ మారే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది.

AICC To Resolve Dissent Against Revanth Reddy : ఆగస్టు 5వ తేదీన గాంధీభవన్‌లో పార్లమెంటు పర్యవేక్షకులతో సమావేశమైన కేసీ వేణుగోపాల్‌, ఆ తర్వాత జరిగిన రాజకీయ వ్యవహార కమిటీ సమావేశంలోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొన్ని అంశాలపై ఉత్తమ్‌కుమార్‌ రెడ్డితో పాటు పలువురు నాయకులు.. రేవంత్​రెడ్డి పట్ల అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇది కేసీ వేణుగోపాల్‌ సమక్షంలోనే దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో అదే రోజు రాత్రి రేవంత్​రెడ్డితో దాదాపు గంటపాటు కేసీ వేణుగోపాల్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణలో ఉన్న తాజా రాజకీయ పరిస్థితులపై పీసీసీని అడిగి తెలుసుకున్నారు.

Congress Focus On Telangana Assembly Elections 2023 : రేవంత్​రెడ్డి.. నాయకులతో కలవడం లేదన్నది ప్రధానమైన ఆరోపణ. ఆయన ఒంటెద్దు పోకడ పోతున్నారని ఏఐసీసీకి పలువురు నాయకులు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్‌(Telangana Congress) పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నప్పటికీ నాయకుల మధ్య సయోధ్య లేదన్న విషయాన్ని కేసీ వేణుగోపాల్ రాష్ట్ర పర్యటన సమయంలో పసిగట్టారు.

T Congress Assembly Elections 2023 Plan : MLAగా పోటీ చేయాలనుందా​? కాంగ్రెస్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. అప్లై చేసేయండి

రాష్ట్రంలో తాజా రాజకీయాలపై రాష్ట్ర రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న సునీల్‌ కనుగోలు ద్వారా నాయకుల గురించి పూర్తి సమాచారం తెప్పించుకోవడంతో పాటు.. నాయకుల మధ్య విబేధాలు ఉంటే పార్టీకి ఏ మేరకు నష్టం ఉంటుందో ఓ నివేదిక తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఉత్తమ్‌ పార్టీ అగ్రనేత సోనియాగాంధీతో సమావేశమై రాష్ట్ర రాజకీయాల గురించి చర్చించిన సమయంలో రేవంత్​ కలుపుకుని పోవడం లేదని కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

Telangana Congress Plans Assembly Elections 2023 : పీసీసీతో కలిసి పనిచేసే పరిస్థితులు లేవని కూడా పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో తెలంగాణలో నాయకుల మధ్య ఉన్న విబేధాలకు స్వస్తి పలకాల్సి ఉందని, అప్పుడే పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని భావించిన సోనియాగాంధీ.. ఇదే విషయాన్ని కేసీ వేణుగోపాల్‌తో చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీంతో రాష్ట్ర రాజకీయాలపై గట్టి పట్టున్న కేసీ వేణుగోపాల్‌ స్వయంగా రంగంలోకి దిగినట్లు సమాచారం.

ఇటీవల దిల్లీలో ఉత్తమ్(MP Utham Kumar Reddy) ఇంటికి వెళ్లిన కేసీ.. సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత గత కొంతకాలంగా మౌనంగా ఉంటున్న జగ్గారెడ్డితో కూడా మాట్లాడినట్లు తెలిసింది. పీసీసీ వ్యవహార శైలి సరిగ్గా లేకపోవడం వలనే తాను దూరంగా ఉంటున్నట్లు చెప్పకొచ్చినట్లు సమాచారం. దీంతో అదంతా తాము చూసుకుంటామని వేణుగోపాల్‌ స్పష్టం చేయడంతో పాటుగా.. ఇటీవల చేసిన సర్వే నివేదికల వివరాలు కూడా అటు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి ఇటు జగ్గారెడ్డి ముందు ఉంచినట్లు తెలుస్తోంది. రోజు రోజుకు కాంగ్రెస్‌కు జనంలో ఆదరణ పెరుగుతోందని.. విబేధాలు ఉంటే పక్కన పెట్టి పార్టీలో అందరితో కలిసి పని చేయాలని సూచించినట్లు సమాచారం. ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలో ఏఐసీసీ చూసుకుంటుందని స్పష్టం చేసినట్లు తెలిసింది.

T Congress Assembly Ticket Application : నేటి నుంచే కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్​కు దరఖాస్తు ప్రక్రియ

పార్టీ కోసం అందరూ కలిసి పనిచేయాలి : రేవంత్​తో అంటీ ముట్టకుండా ఉంటున్న నాయకుల్లో సీనియర్లను పరిశీలిస్తే.. ప్రధానంగా మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్‌ రాజనర్సింహ చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ.. నియోజకవర్గంలో పని చేసుకుంటున్నారు. ముఖ్యమైన సమావేశాలకు మాత్రమే హాజరవుతున్నారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు హనుమంతురావు, ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీ, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలు గత కొన్ని రోజులుగా కలిసి పని చేస్తున్నారు. అదేవిధంగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి(MP Komatireddy Venkat Reddy) గత కొంతకాలంగా రేవంత్​రెడ్డితో కలిసి ముందుకు వెళుతున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నల్గొండ ఎంపీ ఉత్తమ్​కుమార్‌ రెడ్డిలు కొంచెం ఎడముఖం, పెడముఖంగా ఉంటుండడంతో వారితో కేసీ వేణుగోపాల్‌ చర్చించి పార్టీ కార్యక్రమాలల్లో పాల్గొంటూ.. కలిసి పని చేయాలని సూచించినట్లు తెలుస్తోంది.

Telangana Congress Assembly Elections 2023 Plan : శాసనసభ ఎన్నికలకు సంబంధించి నాయకులంతా కలిసికట్టుగా పని చేసి, నాయకుల మధ్య విబేధాలు లేవన్న భావన జనంలోకి తీసుకెళ్లాలని ఏఐసీసీ స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. నాయకులు ఐఖ్యతను చాటినట్లయితే జనంలో కాంగ్రెస్‌పై ఉన్న విశ్వాసం రెట్టింపు అవుతుందని పార్టీ సీనియర్‌ నాయకులు చెబుతున్నారు. పార్టీలో నాయకుల మధ్య విబేధాలు సమసి పోయాయని కలిసికట్టుగా పార్టీ కార్యక్రమాలల్లో పాల్గొనే సానుకూల వాతావరణం ఏర్పడుతుందని ఏఐసీసీ అంచనా వేస్తోంది.

Congress Chevella Praja Garjana Sabha : ఈ నెల 26న చేవెళ్ల ప్రజాగర్జన సభ.. SC, ST డిక్లరేషన్​ విడుదల చేయనున్న ఖర్గే

Revanth Reddy Comments on his Security : 'భద్రత విషయంలో నన్ను భయపెట్టాలని చూడకండి.. అస్సలు భయపడే వ్యక్తినే కాను'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.