వేలాది మంది వరద బాధితులకు సాయం చేయకుండా మీసేవల వద్ద పడిగాపులు కాసేలా చేశారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ధ్వజమెత్తారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్ల కోసమే చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
వరద బాధితుల ఖాతాల్లో డబ్బులు వేసే అవకాశం ఉన్నా ప్రభుత్వం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తోందని దుయ్యబట్టారు. సీఎం నిర్వాకం వల్ల బాధితులు చివరికి చనిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ఇప్పటివరకు వరద నష్టాన్ని అంచనా వేశారా అని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.