తెరాసకి మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత లేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి కాంగ్రెస్‌కి ఓటు వేయాలని కోరారు. మున్సిపల్ శాఖకు కేటాయింపులు కోట్లలో జరిగాయని, మంజూరుకు మాత్రం నోచుకోలేదన్నారు. తెరాస ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా మాటల గారడీ చేస్తోందని విమర్శించారు. తెరాస- భాజపా రెండు ప్రభుత్వాలు ప్రజలను మోసగించాయని తెలిపారు. స్మార్ట్ సిటీలు అని చెప్పిన భాజపా వరంగల్‌కి నిధులు ఇవ్వలేదని దుయ్యబట్టారు.
ఇవీ చూడండి: సెంట్రల్ మావోయిస్టు కమిటీ సభ్యుడి లొంగుబాటు