ETV Bharat / state

అంతర్జాతీయ విత్తన సదస్సు నిర్వహణపై మంత్రి సమీక్ష - ఇష్టా కాంగ్రెస్​

ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ విత్తన సదస్సు ఇష్టాకాంగ్రెస్​ - 2019 రాజధానిలో నిర్వహించడం రాష్ట్రానికే గర్వకారణమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​రెడ్డి అన్నారు. ఈ నెల 26 నుంచి జరిగే కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై హైదరాబాద్​ నార్సింగిలోని తన నివాసంలో అధికారులతో సమీక్షించారు.

విత్తన సదస్సు
author img

By

Published : Jun 18, 2019, 6:08 PM IST

విత్తన సదస్సు నిర్వహణపై మంత్రి సమీక్ష

భాగ్యనగరం వేదికగా ప్రతిష్ఠాత్మకంగా ఇష్టాకాంగ్రెస్ - 2019 నిర్వహించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఈ నెల 26 నుంచి జులై 3 వరకు జరిగే అంతర్జాతీయ విత్తన సదస్సు ఏర్పాట్లపై నార్సింగిలోని తన నివాసంలో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారధి, కమీషనర్ రాహుల్ బొజ్జ, తెలంగాణ సీడ్స్ డైరెక్టర్ కేశవులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సదస్సుకు 70 దేశాల నుంచి 800 మంది ప్రతినిధులు హాజరవుతున్నట్లు నిరంజన్​రెడ్డి తెలిపారు.

రాష్ట్రాల వ్యవసాయ మంత్రులకు ఆహ్వానం

విత్తన సదస్సుకు అన్ని రాష్ట్రాల మంత్రులను ఆహ్వానించాలని సమావేశంలో నిర్ణయించారు. విత్తన సాంకేతిక అంశాలు, రైతులతో సమావేశాలు, ప్రదర్శనలు, సదస్సుకు భద్రత, సాంస్కృతిక కార్యక్రమాలపై అధికారులకు సూచించారు. సదస్సులో వివిధ దేశాల సంస్థలు 65 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. మరో రెండు మూడ్రోజుల్లో ఏర్పాట్లు పూర్తి కావాలని ఆదేశించారు.

ఇదీ చూడండి : ఇంటర్ బోర్డు ముందు ఒప్పంద అధ్యాపకుల ధర్నా

Intro:రాచకొండ గత నెల సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్మాన్ ఘాట్ లో ఇంట్లో జరిగిన చోరీ కేసు ఛేదించిన కరీంనగర్ పోలీసులు.

Body:సిద్దిపేట జిల్లా కు చెందిన శ్రీనివాస్ ని ని అరెస్ట్ చేసిన పోలీసులు నిన్ను తుని నుండి 13 లక్షల 50 వేలు లక్ష నగదు మరియు ఒక సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
ఇంట్లో అల్ మారి లో పెట్టిన 14 లక్షల నగదును గుట్టుచప్పుడు కాకుండా ఎత్తుకెళ్లి నిందితుడు తన స్వగ్రామానికి పరారైనట్లు ఎల్ బి నగర్ డిసిపి తెలిపారు.

Conclusion:దొంగతనం జరిగిన ఇంట్లో ఉన్న లేడీ గతంలోని పరిచయం ఉందని పోలీసులు తెలిపారు. శ్రీనివాసుని పట్టుకొని రిమాండ్కు తరలించారు. ఈ కేసును ఛేదించిన పోలీసులకు కు రివార్డు అందజేశారు

బైట్: సన్ ప్రీత్ సింగ్ (డిసిపి )
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.