పల్లెసీమలే దేశ ప్రగతికి పట్టుగొమ్మలని... గాంధీజీ కలలు కన్న గ్రామ వికాసం కోసం సీఎం కేసీఆర్ తపన పడుతున్నారని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 20న వనపర్తి జిల్లాలో జరగనున్న పంచాయతీ సమ్మేళనానికి ఇన్‌ఛార్జి మంత్రిగా ఆయన హాజరుకానున్నారు. 21న జోగుళాంబ గద్వాల, 23న నాగర్ కర్నూలు జిల్లాల్లో నిర్వహించే పంచాయతీ సమ్మేళనాల్లో పాల్గొననున్నారు.
ఆయా జిల్లాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్పర్సన్లు, ఇతర ప్రజాప్రతినిధులతో సహా గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులు తప్పనిసరిగా ఈ సమ్మేళనాలకు హాజరయ్యేలా చూడాలని... జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో కనీస వసతులు కల్పించాలని, పారిశుద్ధ్యం సక్రమంగా ఉండాలని... మొక్కల పెంపకం ఉద్యమంలా సాగాలని చెప్పారు.
ఇదీ చూడండి: భవననిర్మాణాలకు 21 రోజుల్లో అనుమతివ్వాలి: కేటీఆర్