బాధితులను ఆదుకోవాలని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ఏపీ రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ విజయవాడలో కోరారు. ఈ మేరకు ఏపీవ్యాప్తంగా అన్ని మండల కార్యాలయాల్లో ఎమ్మార్వోలకు వినతిపత్రాలు అందించినట్లు తెలిపారు.
నేటికి బాధితులకు కేవలం రూ. 239 కోట్లు మాత్రమే అందించగా... రెండవ బడ్జెట్లో రూ. 200 కోట్లను మాత్రమే కేటాయించటంలో మర్మమేమిటని ప్రశ్నించారు. పేదలకు వేల కోట్లు పంపిణీ చేస్తున్న ఏపీ ప్రభుత్వం... తమపై చిన్నచూపు చూడటం సరికాదన్నారు.