Lokesh yuvagalam 1st day : మొదటి రోజు పాదయాత్ర పూర్తి చేసుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పీఈఎస్ ఆసుపత్రికి వచ్చారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి వివరాలు వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. తారకరత్న ఆరోగ్యపరిస్థితి సమీక్షించేందుకు ప్రత్యేక వైద్యులు బృందం బెంగుళూరు నారాయణ హృదయాలయ నుంచి కుప్పం వచ్చింది. లోకేశ్, బాలకృష్ణలు బెంగుళూరు నుంచి వచ్చిన వైద్యుల బృందాన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మెరుగైన వైద్యం కోసం తారకరత్నను బెంగుళూరుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బెంగళూరు నుంచి అత్యాధునిక పరికరాలను వైద్యులు కుప్పం పీఈఎస్ హాస్పిటల్‌కు తీసుకు తీసుకువచ్చారు. బెంగళూరు తరలించే కంటే కుప్పంలోనే వైద్య సహాయం అందిచే ఏర్పాట్లు వైద్యులు చేస్తున్నారు. తారకరత్న భార్య కుప్పం వచ్చాక బెంగుళూరు తరలింపుపై కుటుంబ సభ్యులు, వైద్యులు తుది నిర్ణయం తీసుకోనున్నారు.
మరోవైపు యువగళం మహా పాదయాత్ర తొలిరోజు పర్యటన ముగించుకున్న లోకేశ్.. రాత్రికి మెడికల్ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన క్యాంప్ సైట్లో బస చేశారు. రెండో రోజు 9.3 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగనుంది.
త్వరగా కోలుకోవాలి: నందమూరి తారకరత్న త్వరగా కోలుకోవాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆకాంక్షించారు. తారకరత్న తీవ్ర అస్వస్థతకు లోను కావడం బాధాకరమన్నారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలిస్తున్నట్లు తెలిసింది.. తారకరత్న త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని.. సంపూర్ణ ఆరోగ్యవంతులై రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నం కావాలని పవన్ తెలిపారు.
ఇవీ చదవండి :