సుమారు ఏడుగంటల సుదీర్ఘ చికిత్సను విజయవంతంగా పూర్తిచేసినట్లు వైద్యులు వెల్లడించారు. మరికొంత సమయం గడిస్తే వెంటిలేటర్ తొలగించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందవద్దని కోరారు.
యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మధులికను నగర అదనపు పోలీస్ కమిషనర్ షికాగోయల్ పరామర్శించారు. గతంలో బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు నిందితుడు భరత్‌కు కౌన్సిలింగ్ ఇచ్చామని తెలిపారు. కానీ అంతలోనే ఈ దారుణానికి పాల్పడతాడని ఊహించలేదన్నారు.
మధులిక ఆరోగ్యం మెరుగుపడుతోందన్న వైద్యుల ప్రకటనతో బంధువుల్లో ఆనందం వ్యక్తమైంది. నిందితున్ని కఠినంగా శిక్షించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు.