హైదరాబాద్ ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలో కల్తీ అల్లంవెల్లుల్లి మిశ్రమాన్ని తయారు చేస్తున్న స్థావరంపై మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహిచారు. రసాయనాలు కలిపి అల్లంవెల్లుల్లిని తయారు చేసి విక్రయిస్తున్న మహ్మద్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు.
హానికరమైన పదార్థాలతో మిశ్రమాన్ని తయారు చేసి... డబ్బాలకు వివిధ బ్రాండ్ల స్టిక్కర్లు అంటించి... తక్కువ ధరకు ఫాస్ట్ఫుడ్ సెంటర్లకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఐదు కిలోల డబ్బాల్లో నిల్వ చేసిన కల్తీ అల్లం మిశ్రమం, తయారీ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి: కేసీఆర్ కటౌట్... మంత్రి తలసానికి జరిమానా