ETV Bharat / state

పాలిసెట్‌- 2020 ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు: రిజిస్ట్రార్ సుధీర్ ‌కుమార్ - ts polycet latest updates

పాలిసెట్‌- 2020 ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు జరుగుతాయని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ స్పష్టం చేశారు. ఆగస్టులో నిర్వహించే పాలిసెట్-2020 ప్రవేశ పరీక్షకు అభ్యర్థులు విధిగా హాజరుకావాలని పేర్కొన్నారు.

admissions-to-various-diploma-courses-in-pjsau-are-based-on-ts-polycet-2020-ranks
పాలిసెట్‌- 2020 ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు: రిజిస్ట్రార్ సుధీర్ ‌కుమార్
author img

By

Published : Jul 14, 2020, 6:18 AM IST

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని వివిధ డిప్లొమా కోర్సుల్లో 2020-21 విద్యా సంవత్సరానికి పాలిసెట్‌-2020 ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు జరుగుతాయని అధికారులు స్పష్టం చేశారు. పాలిసెట్-2020 ప్రవేశ పరీక్షకు అభ్యర్థులందరూ విధిగా హాజరుకావాలన్నారు. వాయిదా పడిన పరీక్షను ఆగస్టులో నిర్వహించేందుకు సాంకేతిక విద్యా, శిక్షణ మండలి నిర్ణయించింది. ఇందుకు 200 రూపాయల ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నె 13 నుంచి 25వ తేదీ వరకు అవకాశం కల్పించింది.

ఫలితాలు వెల్లడించిన తర్వాత... వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రత్యేకంగా అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఆసక్తిగల అభ్యర్థులు వర్సిటీ అడ్మిషన్ నోటిఫికేషన్ ప్రకారం... విడిగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వ్యవసాయ విశ్వవిద్యాలయం డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం అభ్యర్థులు కనీసం నాలుగేళ్లు గ్రామీణ ప్రాంతాల్లో విధిగా చదవాలి.

పాలిసెట్-2020 ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి 25వ తేదీ వరకు పొడిగించిన దృష్ట్యా... ఆన్‌లైన్ దరఖాస్తు, నియమ నిబంధనలు, ఇతర అన్ని రకాల వివరాలు ఆన్‌లైన్‌లో www.policetts.nic.in, www.sbtet.telangana.gov.in వెబ్​సైట్ల ద్వారా చూసుకోవచ్చని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ సుధీర్‌కుమార్ వెల్లడించారు.

ఇదీ చూడండి: భాగ్యనగరంలో భారీ వర్షం.. తడిసి ముద్దయిన జనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.