లంగర్ హౌస్‌లోని న్యూ హారిజన్ స్కూల్ ప్రక్కనే మద్యం దుకాణం ప్రారంభం కానుందని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీంతో చాలా ఇబ్బందులు తలెత్తుతాయని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులకు, మంత్రులకు లేఖలు రాశారు. సమస్యపై స్పందిచిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మద్యం దుకాణం ఏర్పాటు ఆపాలంటూ ఎక్సైజ్ శాఖకు లేఖ రాశారు. అధికారులు పట్టించుకోకపోతే ధర్నా చేస్తామని పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి : బాధిత ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు తెదేపా ఆర్థికసాయం