ETV Bharat / state

కేటీఆర్​తో ఆదిత్య ఠాక్రే భేటీ.. ఆ అంశాలపై చర్చ - telangana latest news

aditya thackrey meets ktr in Hyderabad: హైదరాబాద్ టీ-హబ్​లో మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే మంత్రి కేటీఆర్​ను కలిశారు. ఠాక్రే బృందం టీ-హబ్​ను సందర్శించిన తర్వాత.. కేటీఆర్​తో భేటీ అయి రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై, టెక్నాలజీపై చర్చించారు.

ktr aditya thackrey meeting in hyderabad
టీ-హబ్​లో యువనేతల భేటీ.. ఆసక్తికర అంశాలపై చర్చ
author img

By

Published : Apr 11, 2023, 2:31 PM IST

aditya thackrey meets ktr in Hyderabad: యువనేతలు మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే హైదరాబాద్​లో ఇవాళ భేటీ అయ్యారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన ఆదిత్య.. టీ-హబ్​లో కేటీఆర్​తో సమావేశమై.. టీ-హబ్ ప్రత్యేకతల గురించి వివరాలు తెలుసుకున్నారు. టీ-హబ్ పనితీరు గురించి, దానికి సంబంధించిన అంశాల గురించి పూర్తి వివరాలను కేటీఆర్​ను అడిగి తెలుసుకున్నారు ఆదిత్య. అయితే ఈ భేటీలో కేవలం టీ-హబ్ గురించే కాదు జాతీయ రాజకీయాల గురించి ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది.

  • Always fantastic and encouraging to meet @KTRBRS ji and connect over our common interests over sustainability, urbanism, technology and how it will help fuel India’s growth.

    Visited the @THubHyd and witnessed the amazing work that’s happened there for start ups, innovators and… pic.twitter.com/G1bJThQgpO

    — Aaditya Thackeray (@AUThackeray) April 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

యువనేతల భేటీ: ఠాక్రే నేతృత్వంలోని బృందం హైదరాబాద్‌లో టీ-హబ్‌ను సందర్శించింది. స్వయంగా మంత్రి కేటీఆర్ వీరికి టీ హబ్​ను చూపించారు. అర్బనైజేషన్ గురించి, వివిధ పథకాల గురించి ఠాక్రే బృందం తెలుసుకుంది. టీ-హబ్‌లోని అంకురాలు, ఇన్నోవేషన్లను పరిశీలించారు. హైదరాబాద్ టీహబ్‌లో స్టార్టప్‌లు, వాటి ఆవిష్కర్తలు, ఆలోచనా పరులు అద్భుతమని ఆదిత్య ఠాక్రే ప్రశంసించారు. సుస్థిరత, పట్టణీకరణ, టెక్నాలజీపై కేటీఆర్‌తో యువనేత ఆదిత్య ఠాక్రే చర్చించారు, వాటికి సంబంధించిన వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు.

ఆసక్తికర అంశాలపై చర్చ: దేశాభివృద్ధిలో టెక్నాలజీ పాత్రపై, దాని ప్రాముఖ్యత, అవసరం గురించి ఇరు యువ నేతలు చర్చించారు. మంత్రి కేటీఆర్‌తో ఎప్పుడు సమావేశమైనా అది అద్భుతంగా, ప్రోత్సాహభరితంగా సాగుతుందని ఆదిత్య ఠాక్రే పేర్కొన్నారు. ఇరువురికి ఆసక్తికర అంశాలైన సుస్థిరత, పట్టణీకరణ, టెక్నాలజీ, దేశాభివృద్ధిలో వాటి పాత్ర తదితర అంశాలపై భేటీలో చర్చించినట్లు ట్వీట్ చేశారు.

దావోస్‌లో భేటీ అనంతరం ఆదిత్య ఠాక్రేతో మరోమారు సమావేశం కావడం సంతోషకరమని మంత్రి కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని సమావేశాలు జరగాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. కేవలం సుస్థిరత, పట్టణీకరణ, అంకురాలు వీటి గురించే కాకుండా దేశంలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి కూడా ఇరు నేతలు చర్చించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పట్ల ప్రవర్తిస్తున్న తీరు గురించి, తాజా రాజకీయ పరిణామాల గురించి మాట్లాడుకున్నారు.

  • Sad state of affairs where top constitutional posts have become political tools in the hands of Union Govt

    Have a look at all Non-BJP Governed states; you will see a similar clear pattern of Non-Cooperation & vengefulness

    Is this the Cooperative Federalism model and Team India… https://t.co/kHtvnCjGKm

    — KTR (@KTRBRS) April 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ట్విటర్​లో కేటీఆర్ ధ్వజం: బీజేపీయేతర ప్రభుత్వాలపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందిని మంత్రి కేటీఆర్ ట్విటర్​లో మండిపడ్డారు. రాజ్యాంగబద్దమైన పదవుల్లో ఉన్నవాళ్లు కూడా రాజకీయాలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలుగా మారి రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నారని పరోక్షంగా గవర్నర్ ఉద్దేశిస్తూ విమర్శించారు. బీజేపీయేతర రాష్ట్ర ప్ఱభుత్వాలకు సహాయనిరాకరణ అడ్డంకులు సృష్టించడం అందరూ గమనిస్తున్నారని అన్నారు. సమాఖ్య స్పూర్తి అంటే ఇదేనా ప్రశ్నించారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.