లాక్డౌన్ సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వివిధ వర్గాల ప్రజలకు ఆదిత్య కృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ తన వంతు సహాయం చేస్తూ... ఆకలితో అలమట్టిస్తున్నా నిరుపేదలను ఆదుకుంటోంది. హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలోని 500 కుటుంబాలకు ట్రస్ట్ ఛైర్మన్ నందకిషోర్ బిలాల్ నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. అబిడ్స్‌లోని ట్రూప్ బజార్, ఉస్మాన్ గంజ్ పలు ప్రాంతాల్లో నిరుపేదలకు ఐదు కేజీల బియ్యం, పప్పు, నూనె, చింతపండు, చక్కెర, గోధుమ పిండి తదితర సరకులను అందజేశారు.
లాక్డౌన్ సమయంలో 25 వేల మంది లక్ష్యంగా ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు బిలాల్ తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుతో... ఆదిత్య కృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఇబ్బందుల్లో ఉన్న వారు ఉంటే తమ ట్రస్ట్‌ను ఆశ్రయించాలని కోరారు.
ఇవీ చూడండి: కేసీఆర్ రాష్ట్రాన్ని ఎడారిగా మారుస్తున్నారు: కోమటిరెడ్డి