ETV Bharat / state

'అన్ని తహసీల్దార్​ కార్యాలయాలకు అదనపు ఇంటర్నెట్​'

author img

By

Published : Oct 8, 2020, 8:57 PM IST

నెలకు రూ. 2000 మించకుండా రాష్ట్రంలోని అన్ని తహసీల్దార్​ కార్యాలయాలకు అదనపు ఇంటర్నెట్​ సౌకర్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తహసీల్దార్​ కార్యాలయాలకే ధరణి, స్తిరాస్థుల సర్వే, మరెన్నో బాధ్యతలు అప్పగించినందుకే ఈ అంతర్జాల వెసులుబాటు కల్పిస్తున్నట్టు పేర్కొంటూ కలెక్టర్లకు ఐటీశాఖ లేఖరాసింది.

Additional Internet to  the all mro offices in telangana state
'అన్ని తహసీల్దార్​ కార్యాలయాలకు అదనపు ఇంటర్నెట్​'

రాష్ట్రంలోని 590 తహసీల్దార్ కార్యాలయాలకు అదనపు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దసరా నుంచి ధరణి వెబ్​సైట్ ప్రారంభం అవుతుండడం, వ్యవసాయ ఆస్తుల రిజిస్ట్రేషన్లు కూడా తహసీల్దార్లు చేయాల్సిన నేపథ్యంలో ఆన్​లైన్ సేవలకు ఎలాంటి అవాంతరం కలగకుండా ఉండేలా ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకుంది.

తహసీల్దార్ కార్యాలయాలకు ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ ద్వారా 12 ఎంబీపీఎస్ సామర్థ్యం కలిగిన నెట్​వర్క్ సదుపాయం ఉంది. దానికి అదనంగా మరో ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించాలని నిర్ణయించిన సర్కారు... స్థానికంగా ఉన్న మంచి నెట్​వర్క్ కనెక్షన్ తీసుకోవాలని ఎమ్మార్వోలకు అనుమతించింది. నెలకు 2000 రూపాయలకు మించకుండా కనెక్షన్ తీసుకోవాలని చెప్తూ ఐటీశాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖ రాసింది.

ఇదీ చూడండి: కొవిడ్, వైద్యశాఖలోని కీలక అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.