బూర్గుల రామకృష్ణారావు భవన్లో పంచాయతీరాజ్ శాఖ కార్యాలయాల మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పీఎంజీఎస్వై నిధులను అదనంగా మంజూరు చేసింది. 17 లక్షల 50 వేల రూపాయలను బీఆర్కే భవన్లోని ఐదో అంతస్తును పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి, అధికారులు, సిబ్బంది కోసం కేటాయించారు.
ఆ కార్యాలయాల మరమ్మతుల కోసం గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పరిపాలనా నిధి నుంచి 30 లక్షల రూపాయలను మంజూరు చేసింది. మరమ్మతులు పూర్తి చేసేందుకు 30 లక్షల రూపాయలు సరిపోవని... అదనంగా మరో 17 లక్షలా 50వేల రూపాయలు కావాలని పంచాయతీరాజ్ చీఫ్ ఇంజినీర్ ప్రతిపాదించారు. సీఈ ప్రతిపాదనకు అనుగుమణంగా పీఎంజీఎస్వై నిధుల నుంచి మరో 17 లక్షల 50 వేల రూపాయలను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.