విద్యాశాఖలో సమూల మార్పులు చేయాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. ఇంటర్ పరీక్ష ఫలితాలపై రీ వెరిఫికేషన్ కోసం వెళ్లిన విద్యార్థులను కొట్టారని ఆరోపించారు. ఈ విషయంలో న్యాయస్థానం సుమోటోగా తీసుకుని ప్రభుత్వంపై కేసు నమోదు చేయాలన్నారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్ ఫలితాలపై త్రిసభ్యకమిటీ అవసరం లేదని... ఆల్ పార్టీ కమిటీ వేయాలని సూచించారు. సీఎల్పీ నేత ఎస్సీ అయినందకే ఓర్వలేక కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. తెరాస ప్రభుత్వానికి పార్టీ ఫిరాయింపుల మీద ఉన్న ప్రేమ ఇంటర్ విద్యార్థుల మీద లేదని మండిపడ్డారు.
ప్రభుత్వంపై సుమోటో కేసు పెట్టాలి: అద్దంకి దయాకర్ - ADDANKI DAYAKAR
తెరాస ప్రభుత్వానికి పార్టీ ఫిరాయింపుల మీద ఉన్న ప్రేమ... ఇంటర్ విద్యార్థుల మీద లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మండిపడ్డారు. ఇంటర్ పరీక్షల్లో అవకతవకలపై న్యాయస్థానం సుమోటోగా ప్రభుత్వంపై కేసు నమోదు చేయాలన్నారు.
విద్యాశాఖలో సమూల మార్పులు చేయాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. ఇంటర్ పరీక్ష ఫలితాలపై రీ వెరిఫికేషన్ కోసం వెళ్లిన విద్యార్థులను కొట్టారని ఆరోపించారు. ఈ విషయంలో న్యాయస్థానం సుమోటోగా తీసుకుని ప్రభుత్వంపై కేసు నమోదు చేయాలన్నారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్ ఫలితాలపై త్రిసభ్యకమిటీ అవసరం లేదని... ఆల్ పార్టీ కమిటీ వేయాలని సూచించారు. సీఎల్పీ నేత ఎస్సీ అయినందకే ఓర్వలేక కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. తెరాస ప్రభుత్వానికి పార్టీ ఫిరాయింపుల మీద ఉన్న ప్రేమ ఇంటర్ విద్యార్థుల మీద లేదని మండిపడ్డారు.
TAGGED:
ADDANKI DAYAKAR