ETV Bharat / state

గ్రీన్​ఛాలెంజ్​లో భాగంగా మొక్కలు నాటిన అదర్​సిన్హా...

ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ ఇచ్చిన గ్రీన్​ఛాలెంజ్​లో భాగంగా హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్​లో రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదర్​సిన్హా మొక్కలు నాటారు. మరో ముగ్గురు ఐఏఎస్​లకు గ్రీన్​ఛాలెంజ్​ విసిరారు.

ADAR SINHA PLANTED PLANTS IN PUBLIC GARDEN IN D PART OF GREEN CHALLENGE
ADAR SINHA PLANTED PLANTS IN PUBLIC GARDEN IN D PART OF GREEN CHALLENGE
author img

By

Published : Dec 3, 2019, 5:55 PM IST

హరిత తెలంగాణే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదర్ సిన్హా కోరారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ ఇచ్చిన గ్రీన్​ఛాంలెంజ్​లో భాగంగా హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్​లో అదర్​సిన్హా మొక్కలు నాటారు. తనను నామినేట్ చేసినందుకు రాజీవ్ శర్మకు కృతజ్ఞతలు తెలిపారు.

ఐఏఎస్ అధికారులు సందీప్ కుమార్ సుల్తానియా, గౌరవ్ ఉప్పల్​తో పాటు సమాచార ప్రధాన కమిషనర్ రాజాసదారాంకు అదర్​సిన్హా గ్రీన్​ఛాలెంజ్​ విసిరారు. గ్రీన్ ఛాలెంజ్ రూపంలో ఎంపీ సంతోష్ కుమార్ ఆకుపచ్చ తెలంగాణ కోసం కృషి చేస్తున్నారన్న అదర్ సిన్హా... వెయ్యి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుందని నిరూపించారని కొనియాడారు.

గ్రీన్ ఛాలెంజ్ అతి తక్కువ సమయంలో ఎక్కువ మందిని ఆకర్షించటంతో పాటు అన్ని వర్గాల వారినీ భాగస్వామ్యం చేసిందని... ఇదే స్ఫూర్తిని అందరూ కొనసాగించాలని ఆకాంక్షించారు.

గ్రీన్​ఛాలెంజ్​లో భాగంగా మొక్కలు నాటిన అదర్​సిన్హా...

ఇవి కూడా చదవండి:

ఈ ప్రశ్నలకు జవాబు చెప్పేదెవరు?

Intro:hyd_tg_25_03_mahila_congress_rali_vo_TS10056
Lsnraju:9394450162
యాంకర్:

Body:కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అవడంతో మహిళలపై ఆకృత్యాలు జరిపేవారు ఎటువంటి భయం లేకుండా పోతుందని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద ఆరోపించారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు జాతీయ రహదారిపై విద్యార్థినిలు మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లతో కలిసి ర్యాలీ నిర్వహించి జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు హైదరాబాద్ నడిబొడ్డులో ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న యువతికి రక్షణ లేదంటే మారుమూల ప్రాంతాల్లో మహిళలకు రక్షణ ఎక్కడ ఉంటుందని ఆమె దుయ్యబట్టారు మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు రక్షణ లేదనే ఉద్దేశంతో విదేశాల నుంచి వచ్చే మహిళా సందర్శకుల సంఖ్య తగ్గిపోయింది అని ఆమె తెలిపారు తప్పు చేసిన నేరస్తులే కాక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి బాధ్యత వహించాలని ఆమె అన్నారు కేవలం ఖజానా నింపుకునేందుకు మద్యం విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని అందువల్లే నేరాలు జరుగుతున్నాయని ఆమె తెలిపారు అందువల్ల రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం పాటించాలని డిమాండ్ చేశారు అశ్లీల వెబ్సైట్ల వల్ల కొంతమంది మృగాలుగా మారుతున్నారని ఆమె తెలిపారు నేరం చేసిన వారికి చాలా ఆలస్యంగా పుడుతుందని వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి ఇ 30 రోజుల్లో శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మనం కోరి తెచ్చుకున్న తెలంగాణ ఇలాంటి ఘటనలు చూసేందుకేనా అని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గోదావరి అంజి రెడ్డి అన్నారు ఇలాంటి ఘటనలు చూసినప్పుడు బాధ కలుగుతుందని ఆమె వాపోయారు నిందితులు కల్పిస్తున్న రక్షణ రాష్ట్రంలో కనీసం మహిళలకు ఎక్కడా లేదని ఆమె ఆరోపించారు ఇలాంటి ఘటనకు పాల్పడిన వారిని ప్రజల ముందే శిక్షిస్తే ఇకపై ఘటనలు జరగకుండా ఉంటాయని ఆమె అభిప్రాయపడ్డారు

Conclusion:బైట్ నేరెళ్ల శారద రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బైట్ గోదావరి అంజిరెడ్డి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.