హైదరాబాద్ హైటెక్ సిటీలోని హెచ్‌ఐసీసీ హోటల్‌లో సినీ కథానాయిక మన్నారా చోప్రా సందడి చేశారు. డిజైన్ లైబ్రరీ పేరిట ఏర్పాటు చేసిన వస్త్రాభరణాల ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. విభిన్న రకాలైన వస్త్రాభరణాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. అందరూ కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని మన్నారా సూచించారు.
తెలుగు, తమిళ చిత్రాలతో పాటు రెండు వెబ్ సిరీస్లలో నటిస్తున్నట్లు ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మన్నారాతో పాటు నిర్వహకులు డామీ, పలువురు మోడల్స్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఆ మూడు సినిమాలు విడుదలకు సిద్ధం