ETV Bharat / state

చిన్నారుల చికిత్స కోసం బంజారాహిల్స్​లో చిత్ర కళ ప్రదర్శన - బంజారాహిల్స్​లో చిన్నారుల చికిత్స కోసం చిత్ర కళ ప్రదర్శన

'మానవసేవే మాధవసేవ' అంటూ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ మానసిక వికలాంగ చిన్నారులకు చికిత్స కోసం హైదరాబాద్​లో చిత్ర కళల ప్రదర్శన ఏర్పాటు చేశారు. దీన్ని వర్ధమాన సినీ కథానాయిక ప్రారంభించి.. పలు వర్ణచిత్రాలను వీక్షించారు.

actress eesha launched painting gallery at hyderabad
బంజారాహిల్స్​లో చిన్నారుల చికిత్స కోసం చిత్ర కళ ప్రదర్శన
author img

By

Published : Aug 12, 2020, 4:16 PM IST

హైదరాబాద్​ బంజారాహిల్స్​లోని విజువల్స్​ ఆర్ట్​ గ్యాలరీలో ప్రముఖ చిత్రకారుడు హరి, చిత్రకారిణి మాయ ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఏర్పాటు చేయగా.. దానిని వర్ధమాన సినీ కథానాయిక ఈషా రెబ్బ ప్రారంభించారు. చిత్రకారుల కలం నుంచి జాలువారిన పలు వర్ణచిత్రాలను ఈషా వీక్షించారు.

ఆధ్యాత్మికత, సామాజిక బాధ్యతగా వేసిన చిత్రాలు అద్భుతంగా ఉన్నాయని ఆమె అభినందించారు. చిత్రకళ ప్రదర్శన ద్వారా వచ్చిన నిధులను హృదయాలయ అనాథశ్రమానికి అందజేయనున్నట్లు నిర్వహకులు వెల్లడించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ మానసిక వికలాంగ చిన్నారుల చికిత్స కోసం ఏర్పాటు చేసిన చిత్ర కళ ప్రదర్శనను ఈషా అభినందించారు.

ఇదీ చదవండి: 'కోజికోడ్​ విమానాశ్రయ రన్​వే సురక్షితమైనదే'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.