హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య కళానిలయంలో సుద్దాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ పురస్కార ప్రదానోత్సవం నిర్వహించారు. ప్రముఖ సినీనటుడు, దర్శక నిర్మాత నారాయణమూర్తిని సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ పురస్కారంతో ఘనంగా సత్కారించారు. ఆర్టీసీ సమ్మెతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రముఖ సినీ నటుడు ఆర్. నారాయణమూర్తి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని సంస్థలను ప్రైవేటీకరిస్తున్నారని ఆందోళ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సుద్దాల అశోక్ తేజ, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : "శ్రీనివాసరెడ్డిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే..."