వకీల్ సాబ్ సినిమా థియేటర్లలో రద్దీ, ప్రేక్షకులు కొవిడ్ నిబంధనలు పాటించకపోవడంపై పవన్ స్టార్ పవన్‌కల్యాణ్ స్పందించారు. ప్రేక్షకులంతా తప్పనిసరిగా మాస్కులు ధరించి సినిమాలు చూడాలని పవన్ విజ్ఞప్తి చేశారు. తన తాజా చిత్రం వకీల్ సాబ్.. విడుదలైన అన్ని కేంద్రాల్లో కిక్కిరిసిన ప్రేక్షకులతో ప్రదర్శితమవుతోంది. కరోనా రెండో దశ తీవ్రత దృష్ట్యా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రేక్షకులు మాస్కులు ధరించాలని పవన్ కోరారు.
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సుదర్శన్ థియేటర్‌ను దర్శక నిర్మాతలు వేణుశ్రీరామ్, దిల్ రాజు, కథానాయికలు అంజలి, అనన్యలు సందర్శించి ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వకీల్ సాబ్‌కు లభిస్తున్న ఆదరణ ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్న దిల్ రాజు... పవన్ కల్యాణ్ చేసిన సూచనలను ప్రేక్షకులకు వివరించారు.
ఇదీ చదవండి: శునకాల కోసం పెట్ పార్కు.. ఎక్కడో తెలుసా?