డిసెంబర్ 1న గ్రేటర్లో జరగనున్న పోలింగ్ కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కరోనా నేపథ్యంలో ఈసారి జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గ్రేటర్లోని 9,101 పోలింగ్ కేంద్రాల్లో ఓటు ఎలా వేయాలో వివరిస్తూ వీడియో ద్వారా ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు.
ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద భౌతిక దూరం పాటించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ బూత్ ప్రవేశద్వారంలో శానిటైజర్ ఏర్పాటు చేశారు. ఓటు వేసేవారు తప్పనిసరిగా మాస్కు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. పోలింగ్ సిబ్బందికి సైతం కరోనా కిట్లు అందించారు. కరోనా నేపథ్యంలో ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి: ఓటుపై సినీ ప్రముఖులు ఏమన్నారంటే!