ETV Bharat / state

మాస్క్ లేకుంటే విపత్తు నిర్వహణ చట్టం కింద చర్యలు: డీజీపీ - Telangana corona news

కరోనా వ్యాప్తి, నివారణ చర్యలపై పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, పోలీస్ స్టేషన్ అధికారులతో డీజీపీ మహేందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా రెండో దశ తీవ్రంగా వ్యాప్తి చెందుతోందని... ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

dgp
డీజీపీ మహేందర్ రెడ్డి
author img

By

Published : Apr 9, 2021, 9:35 PM IST

కరోనాను అరికట్టాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని... బహిరంగ ప్రదేశాల్లో మాస్కు లేకుండా తిరిగే వాళ్లపై జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. కరోనా నివారణ కోసం పోలీస్ శాఖ తరఫున పెద్ద ఎత్తున అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.

కరోనా వ్యాప్తి, నివారణ చర్యలపై పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, పోలీస్ స్టేషన్ అధికారులతో డీజీపీ మహేందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా రెండో విడత రాష్ట్రంలో తీవ్రంగా వ్యాప్తి చెందుతోందని... ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాల సాయం తీసుకొని పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

షాపింగ్ మాల్, కిరాణా దుకాణాలు, మద్యం షాపులు, సినిమా థియేటర్లలోకి మాస్కులు లేని వాళ్లను అనుమతించొద్దని... మాస్కు పెట్టుకోని వాళ్లకు సరుకులు కూడా ఇవ్వొద్దని డీజీపీ స్పష్టం చేశారు. పోలీస్ శాఖలోని ప్రతి ఒక్కరూ కొవిడ్ వాక్సిన్ తీసుకోవాలని... ఈ విషయంలో సంబంధిత అధికారులు చొరవ తీసుకోవాలని మహేందర్ రెడ్డి ఆదేశించారు.

వాక్సిన్ వేసుకోని పోలీసులను గుర్తించి వాళ్లు వెంటనే టీకా తీసుకునేలా ప్రోత్సహించాలని తెలిపారు. వచ్చే వారంలో పోలీస్ శాఖలో 95శాతం వాక్సినేషన్ పూర్తి కావాలని డీజీపీ ఆదేశించారు.

ఇవీచూడండి: జీహెచ్ఎంసీ సిబ్బందికి 100 శాతం వ్యాక్సినేషన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.