ETV Bharat / state

'గాంధీ ఆస్పత్రి'లో అత్యాచారం కేసులో విచారణ వేగవంతం: ఏసీపీ - Gandhi Hospital latest issue

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో తనకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశారని మహబూబ్​నగర్​కు చెందిన మహిళ ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి.. భరోసా సెంటర్​కు తరలించారు. ఈ కేసులో బాధితురాలి సోదరి కోసం గాలిస్తున్నామని.. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు స్పష్టం చేశారు.

'గాంధీ ఆస్పత్రి'లో అత్యాచారం కేసులో విచారణ వేగవంతం: ఏసీపీ

author img

By

Published : Aug 16, 2021, 10:53 PM IST

గాంధీ ఆసుపత్రిలో తనపై అత్యాచారం జరిగినట్లు చిలకలగూడ పోలీస్​స్టేషన్​లో మహిళ ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ముఖ్యంగా తన సోదరి కనిపించకుండా పోయిందని, ఆమెను కూడా అపహరించారంటూ మహిళ చెప్పడంతో గాంధీ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు తనిఖీ చేస్తున్నారు.

ఈ నెల 4న చికిత్స కోసం మహబూబ్​నగర్ జిల్లా నుంచి ఓ మహిళ, తన సోదరి భర్త నర్సింహులు చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రిలో చేరారు. వారి ప్రాంతానికే చెందిన దూరపు బంధువు ఉమా మహేశ్వర్​ అనే వ్యక్తి గాంధీ ఆసుపత్రిలో ఎక్స్‌ రే విభాగంలో టెక్నీషియన్​గా పని చేస్తున్నాడు. అతని ద్వారానే ఆస్పత్రిలో నర్సింహులును అడ్మిట్ చేశారు. ఈ నెల 7న వైద్యులు నర్సింహులును మరో వార్డుకు పంపారు. ఆరోగ్యం కుదుటపడటంతో 11న నర్సింహులు ఒక్కడే డిశ్ఛార్జి అయి బయటికి వచ్చాడు. అతని భార్య, బాధిత మహిళ కనపడకుండాపోయారు. దీంతో నర్సింహులు చుట్టు పక్కల గాలించి.. కనిపించకపోవడంతో ఇంటికి వెళ్లిపోయాడు.

గాంధీ మార్చురీ సమీపంలో వివస్త్రగా..

ఈ నెల 15న గాంధీ మార్చురీ సమీపంలో బాధిత మహిళ తాగిన మైకంలో వివస్త్రగా పడి ఉంది. గమనించిన కొందరు మహేశ్వర్​ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో మహేశ్వర్​ నర్సింహులు కుమారుడికి సమాచారం అందించాడు. నర్సింహులు కుమారుడు వచ్చి బాధిత మహిళను అడగ్గా.. తనపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారం చేశారని వాపోయింది. మహబూబ్‌నగర్ జిల్లాకు వెళ్లి పోలీసులను ఆశ్రయించగా.. చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు ఇవ్వాలని వారు సూచించారు. దీంతో బాధిత మహిళ కుటుంబసభ్యులతో కలిసి నేడు చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

జీరో ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు..

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా మహిళను భరోసా సెంటర్​కు తరలించారు. ఘటన సమయంలో మహిళ కల్లు సేవించి ఉన్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా కేసు విచారణలో మహబూబ్‌నగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్​లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు అయినట్లు తమ దృష్టికి రాలేదని గోపాలపురం ఏసీపీ వెంకట రమణ తెలిపారు. బాధితురాలి వాంగ్మూలం రికార్డ్ చేశామని వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తు కోసం నాలుగు పోలీసు బృందాలు ఏర్పాటు చేశామని.. సీసీ కెమెరాలు, కాల్ రికార్డు పరిశీలిస్తున్నామన్నారు.

సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు..

బాధిత మహిళపై అత్యాచారం జరిగిందా.. లేదా అనేది వైద్య పరీక్షల అనంతరం తెలుస్తుందన్న ఏసీపీ.. ల్యాబ్​ టెక్నీషియన్ ఉమా మహేశ్వర్​ను విచారించినట్లు వెల్లడించారు. గాంధీ ఆసుపత్రి సెక్యూరిటీ గార్డుతో పాటు పలువురిని విచారిస్తున్నామన్నారు. గాంధీ ఆసుపత్రి నుంచి బాధిత మహిళ సోదరి ఎక్కడకి వెళ్లింది అనేది సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

ఇదీ చూడండి: గాంధీ ఆస్పత్రిలో దారుణం.. మత్తు మందు ఇచ్చి అత్యాచారం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.