ETV Bharat / state

టిక్​టాక్​కు 'యాసిడ్' ఎఫెక్ట్!

టిక్​టాక్​పై వివాదాలు మరింత ఎక్కువ అవుతున్నాయి. నిత్యం ఏదొక చోట... కేసులు నమోదవుతునే ఉన్నాయి. ఇటీవల ఓ యాసిడ్ వీడియో మరింత సంచలనమైంది. దీని మీద పెద్ద ఎత్తున అభ్యంతరాలు వెల్లువెత్తున్నాయి.

author img

By

Published : May 21, 2020, 10:14 AM IST

acid-effect-on-tiktok
టిక్​టాక్​కు 'యాసిడ్' ఎఫెక్ట్!

టిక్​టాక్​లో ముంబయికి చెందిన టిక్​టాక్ స్టార్ ఫైసల్ సిద్ధిఖీ పోస్ట్ చేసిన ఓ వీడియోపై దేశవ్యాప్తంగా సోషల్​మీడియాలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. మహిళలపై ఆమ్లదాడులను ప్రోత్సాహించేలా ఈ వీడియో ఉందని పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చాయి. ఫలితంగా ఆయన ఖాతాను ఆ సంస్థ స్తంభింపజేసింది. హైదరాబాద్​లోనూ టిక్​టాక్ వీడియోలపై ఫిర్యాదులు రావడంతో ఆ సంస్థపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగిస్తున్నామని సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. యాసిడ్ దాడిని ప్రోత్సహించేలా వీడియో ఉందంటూ జాతీయ మహిళా కమిషన్ ఛైర్​పర్సన్ రేఖాశర్మ మహారాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

టిక్​టాక్​పై మరిన్ని వివాదాలు...

  • ఇటీవల తన సోదరి పాడిన పాటను పేరడీ చేసి అసభ్యంగా మార్చి టిక్​టాక్​లో వీడియో అప్​లోడ్ చేశారంటూ ఓ యువకుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
  • కరీంనగర్​కు చెందిన ఒక వివాహిత పెడుతున్న వీడియోలపై ఆమె భర్త తీవ్ర అభ్యంతరం తెలిపాడు. కుటుంబ పెద్దలు హైదరాబాద్​ వచ్చి సైబర్ క్రైమ్ పోలీసులకు విషయాన్ని వివరించి ఆమె టిక్​టాక్ ఖాతాను తొలగింపజేశారు.
  • రాయలసీమ యాసను కించపరిచేలా టిక్​టాక్​లో వీడియోలు రూపొందిస్తున్నారంటూ హైదరాబాద్​కు చెందిన ఓ బృందంపై కడప మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇవీ చూడండి: తీరం దాటిన అంపన్-బంగాల్​లో ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.