Minister Murder Plan Case: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో నిందితులు చర్లపల్లి జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. విడుదల అనంతరం మీడియాతో మాట్లాడిన నిందితులు యాదయ్య, మున్నూరు రవి... తమపై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారని మండిపడ్డారు. నాలుగు రోజుల పేట్ బషీరాబాద్ పోలీసుల కస్టడీ విచారణలో పోలీసులు... మంత్రితో రాజీకి రావాలని పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ రమేశ్ తమతో అన్నట్టు నిందితుడు యాదయ్య తెలిపారు.
Srinivas Goud Murder Plan Case: 'బెయిల్ ఇస్తే నిందితులు దుష్ప్రచారాలు చేస్తారు'
తాము ఇంతవరకు సుచిత్ర వద్ద అడుగు పెట్టినట్లు రుజువు చూపిస్తే.. అక్కడే ఆత్మహత్య చేసుకుంటామని యాదయ్య సవాల్ విసిరారు. తమపై కేసు పెట్టిన వ్యక్తులు ఎవరో తమకు తెలియదని.. ఇంతవరకు వారిని చూడలేదన్నారు. కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతున్నట్లు స్పష్టం చేశారు. అక్రమ కేసులపై త్వరలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్రపతిని కలుస్తామని తెలిపారు. తమపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని మున్నూరు రవి ఆరోపించారు. కోర్టుల ద్వారా కేసులను ఎదుర్కొంటామని.. త్వరలో పూర్తి ఆధారాలతో మీడియా ముందుకు వస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: IT employee selling Ganja: గంజాయి విక్రయిస్తున్న ఐటీ ఉద్యోగిని