ETV Bharat / state

మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ హత్యకు కుట్ర కేసు.. విచారణకు సహకరించని నిందితులు

Murder Plan to Kill TRS Minister: మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ హత్యకు కుట్ర కేసులో నిందితుల కస్టడీ కొనసాగుతోంది. మూడు రోజుల పాటు విచారణ చేపట్టగా.. నిందితులు ఎలాంటి విషయాలు చెప్పలేదని పోలీసులు తెలిపారు. నేడు చివరి రోజు కస్టడీ కొనసాగనుంది.

conspiracy in the minister srinivas murder case
మంత్రి శ్రీనివాస్​ హత్యకు కుట్ర కేసు విచారణ
author img

By

Published : Mar 12, 2022, 1:14 PM IST

Murder Plan to Kill TRS Minister: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో నిందితులు విచారణకు సహకరించడం లేదని పోలీసులు తెలిపారు. హత్య ఎందుకు చేయాలనుకున్నారనే కోణంలో మూడ్రోజుల పాటు నిందితులను విచారించారు. తుపాకులు ఎక్కడ నుంచి తెచ్చారు.. డబ్బులు ఎవరు సమకూర్చారని ప్రశ్నించారు. హత్యకు కుట్ర కేసులో ఇతరుల పాత్రపైనా ఆరా తీశారు. విచారణలో నిందితులు ఎలాంటి విషయాలు చెప్పలేదని పోలీసులు పేర్కొన్నారు.

పోలీస్​ కస్టడీలో నేడు చివరిరోజు కావటంతో ఇవాళ లేదా రేపు నిందితులను కోర్టులో హాజరుపరచనున్నారు. మరోసారి నిందితులను కస్టడీకి తీసుకునే యోచనలో పేట్ బషీరాబాద్ పోలీసులు ఉన్నట్లు సమాచారం.

పోలీసు కస్టడీలో మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ హత్యకు కుట్ర కేసు నిందితులు

మంత్రి హత్యకు కుట్రలో ఎవరెవరి పాత్ర ఉంది.. 15 కోట్ల రూపాయల సుపారీకి సంబంధించిన వివరాలు రాబట్టేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ హత్యాయత్నం ఘటనతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్యకు.. కుట్ర వివరాలు బయటపడ్డాయి. సుచిత్ర కూడలిలో ఫరూఖ్‌, హైదర్‌ అలీ అనే వ్యక్తులపై ఫిబ్రవరి 25న హత్యాయత్నం జరిగింది. ఈ కేసులో నిందితులు యాదయ్య, నాగరాజు, విశ్వనాథ్‌లను అరెస్టు చేసి.. హత్యాయత్నంపై ప్రశ్నిస్తున్న క్రమంలో కుట్ర కోణం బయటపడింది.

ఇదీ చదవండి: Woman's Suspicious Death : తల్లి చనిపోయిందని తెలియక.. 4 రోజులుగా స్కూలుకెళ్లొస్తూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.