ETV Bharat / state

నిమజ్జనం వేళ అపశ్రుతి.. లారీ కింద పడి యువకుడు మృతి - road accident

young man died in Vinayaka immersion రాత్రి గణేశ్​ నిమజ్జనంలో డీజే పాటలతో డప్పుల కోలహలం మధ్య ఎంతో సంతోషంగా గడిపాడు. నిమజ్జనం పూర్తి చేసుకుని ఇంటికి వస్తున్న తరుణంలో లారీ వెనుక చక్రాల కింద ప్రమాదవశాత్తు పడిపోయాడు. ఈ ఘటనలో ఆ యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు.

నిమజ్జనం వేళ అపశృతి
నిమజ్జనం వేళ అపశృతి
author img

By

Published : Sep 10, 2022, 11:35 AM IST

young man died in Vinayaka immersion: హైదరాబాద్‌లో జరుగుతున్న గణేశ్‌ నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. లారీ వెనుక చక్రాల కింద ప్రమాదవశాత్తు పడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని శాలిబండ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యువకుడు జైసాయి శుక్రవారం తెల్లవారుజామున గణేశ్‌ నిమజ్జనం ముగించుకొని లారీపై ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. ఈ క్రమంలో అబిడ్స్ చర్మాస్ వద్దకు రాగానే లారీ పై నుంచి ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. వెనుక చక్రాలు కింద పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న అబిడ్స్ పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.