హైదరాబాద్ నుంచి తమిళనాడులోని తిరుచ్చి వెళ్తున్న విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం ఆకస్మాత్తుగా కుదుపులకు గురవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కుదుపుల ధాటికి విమానంలో వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయాయి.
20 నిమిషాల పాటు టెన్షన్
విమానం దాదాపు 20 నిమిషాలపాటు కుదుపులకు గురైనట్లు తెలుస్తోంది. ఘటన సమయంలో విమానంలో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒక్కసారిగా కుదుపులు రావడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పైలట్ చాకచాక్యంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. విమానం గమ్యానికి సురక్షితంగా చేరుకోవడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆయిచే ఆకాశం మేఘావృతమై ఉండడం వల్లే ఘటన జరిగినట్లు భావిస్తున్నారు.
ఇదీ చూడండి:
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత కన్నుమూత