ETV Bharat / state

Regularisation From Today: నేటి నుంచి క్రమబద్ధీకరణ దరఖాస్తుల స్వీకరణ

Regularisation From Today: ప్రభుత్వ భూముల్లో నిర్మాణాల క్రమబద్ధీకరణకు.. ఇవాళ్టి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చే నెల 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు 125 గజాల దాకా ఉచితంగా క్రమబద్ధీకరించనున్నారు.

Regularisation From Today: నేటి నుంచి క్రమబద్ధీకరణ దరఖాస్తుల స్వీకరణ
Regularisation From Today: నేటి నుంచి క్రమబద్ధీకరణ దరఖాస్తుల స్వీకరణ
author img

By

Published : Feb 21, 2022, 5:33 AM IST

Updated : Feb 21, 2022, 7:07 AM IST

Regularisation From Today: నేటి నుంచి క్రమబద్ధీకరణ దరఖాస్తుల స్వీకరణ

Regularisation From Today: ప్రభుత్వ భూముల్లో నిర్మాణాల క్రమబద్ధీకరణకు.. ఇవాళ్టి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చే నెల 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు 125 గజాల దాకా ఉచితంగా క్రమబద్ధీకరించనున్నారు. ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపట్టిన చోట.. క్రమబద్ధీకరణకు సోమవారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆక్రమణదారులు 2014 జూన్‌ 2కి ముందు నుంచే ఆ స్థలంలో నివాసం ఉంటున్నట్లు నిర్ధారించే ఆధారాలతో మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఈ నెల 14న రెవెన్యూశాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్న విషయం తెలిసిందే. జీవో ఎంఎస్‌ 14ను అనుసరించి సోమవారం నుంచి వచ్చే నెల 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇంతకుముందు రాష్ట్రంలో నిర్వహించిన క్రమబద్ధీకరణ ప్రక్రియకు 2014 డిసెంబరు 30న జారీ చేసిన ఎంఎస్‌ నం. 58, 59 ప్రకారం నిబంధనలు వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది.

రుసుం చెల్లింపులపై అస్పష్టత..

తాజా ఉత్తర్వుల్లో పలు అంశాలపై స్పష్టత కొరవడింది. 2014 నాటి ఉత్తర్వుల్లోని నిబంధనలే వర్తిస్తాయని రెవెన్యూశాఖ పేర్కొంది. అయితే జీవో ఎంఎస్‌ నం 59 కింద ఆక్రమిత భూములకు చెల్లించాల్సిన రుసుం ఎన్ని కిస్తీల్లో, ఏ గడువు లోపల చెల్లించాలనేది స్పష్టత ఇవ్వలేదు.

గతంలో ఇలా..

గత క్రమబద్ధీకరణలో 5 కిస్తీల్లో చెల్లించేందుకు అవకాశం కల్పించారు. ఒకేసారి రుసుం మొత్తం చెల్లించిన వారికి 5 శాతం మినహాయింపు సైతం ఇచ్చారు. భూముల క్రమబద్ధీకరణకు ఆర్డీవో ఛైర్మన్‌గా, తహసీల్దారు సభ్య కన్వీనర్‌గా కమిటీలను ఏర్పాటు చేశారు. దరఖాస్తు అందిన 90 రోజుల్లో క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేస్తామని, తహసీల్దారు సంబంధిత కుటుంబంలోని మహిళ పేరున డీడ్‌ జారీ చేస్తారని నాడు పేర్కొన్నారు. అభ్యంతరాలు, సూచనలు జారీ చేసే అధికారాన్ని జిల్లా సంయుక్త కలెక్టర్‌కు (ఇప్పుడు అదనపు కలెక్టర్లు ఉన్నారు) అప్పగించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అసైన్‌మెంట్‌ కమిటీలు లేవు. 2019లో ఆ కమిటీలను రద్దు చేసి కలెక్టర్‌కు అదనపు అధికారాలు అప్పగించారు. తహసీల్దార్లకు కూడా ఇప్పుడు ఎటువంటి అధికారాలు లేవు. ఈ నేపథ్యంలో భూముల క్రమబద్ధీకరణ ఎలా చేపడతారోనని రెవెన్యూవర్గాల నుంచి ఆశావహుల వరకూ ఎదురుచూస్తున్నారు.

దరఖాస్తు పత్రంతో జత చేయాల్సినవి

* ఆక్రమణదారు పేరు, భర్త/భార్య పేరుతోపాటు తండ్రి/భర్త, ఇతర కుటుంబ సభ్యుల పేర్లు

* ప్రస్తుత చిరునామా

* ఆక్రమించిన అభ్యంతరం లేని ప్రభుత్వ భూమి/భూ పరిమితి, మిగులు భూమి వివరాలు

* ఆక్రమిత స్థలం విస్తీర్ణం

* సర్వే నం, గ్రామం/వార్డు/మండలం

* ఏ తేదీ నుంచి ఆక్రమణలో ఉంది?(ఆధారాలు జత చేయాలి)

* దరఖాస్తుదారు గుర్తింపు రుజువు (ఆధార్‌/ఓటరు గుర్తింపు కార్డు/ డ్రైవింగ్‌ లైసెన్సు/బ్యాంకు ఖాతా/పాస్‌పోర్టు)

* భూమి స్వాధీనంలో ఉన్నట్లు నిర్ధారించే పత్రాలు (రిజిస్ట్రేషన్‌ దస్తావేజులు/ఆస్తిపన్ను చెల్లింపు రసీదు/విద్యుత్‌ బిల్లు రసీదు/కొళాయి బిల్లు రసీదు/స్థానిక సంస్థల నుంచి జారీ చేసిన భవన నిర్మాణ అనుమతి పత్రం)

* నివాస/నివాసేతర కట్టడం విస్తీర్ణం (చ.గజాల్లో) (ఉత్తర్వుల్లోని మార్గదర్శకాలు అనుసరించి)

* ఆక్రమణదారుకి సంబంధిత అధికారులు నుంచి ఏవైనా నోటీసులు అందితే వాటి వివరాలు, కోర్టు కేసులుంటే ఆ వివరాలు

* స్వీయ ధ్రువీకరణ, ఫొటో

126 చ.గజాలు దాటితే..

* దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబం (బీపీఎల్‌) అయితే 125 చ.గజాల లోపు భూమిని ఉచితంగా క్రమబద్ధీకరిస్తారు.

* నోటిఫైడ్‌ మురికివాడల్లో 125 చ.గజాల నుంచి 150 చ.గజాల వరకు ఆధీనంలో ఉంటే.. 02.06.2014 నాటి భూమి మూల ధరలో 10 శాతం, నోటిఫైడ్‌ మురికివాడ కాని ప్రాంతమైతే 25 శాతం చెల్లించాలి.

* 250 చ.గజాల వరకు 25 శాతం, 500 చ.గజాల వరకు 50 శాతం, 500 చ.గజాలకు పైన ఆక్రమిత స్థలానికి 75 శాతం చెల్లింపులు చేయాలి.

* నివాసేతర నిర్మాణాలున్నట్లయితే ఆ భూములకు పూర్తిస్థాయి మూల ధర చెల్లించాలి.

ఇదీ చూడండి: 'రాష్ట్ర విధానాలను దేశం స్ఫూర్తిగా తీసుకున్నప్పుడే అభివృద్ధి సాధ్యం'

Last Updated : Feb 21, 2022, 7:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.