అసెంబ్లీ మాజీ కార్యదర్శి సదా రాజారాంకు అనిశా ప్రత్యేక న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. ఓటుకు నోటు కేసులో ఈనెల 13న సాక్ష్యులుగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. జులై 7 నుంచి 13 వరకు 18 మందిని విచారణ జరిపి వాంగ్మూలం నమోదు చేసేందుకు న్యాయస్థానం షెడ్యూలు ఖరారు చేసింది. ఇవాళ జరగాల్సిన విచారణకు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య సహా నిందితులందరి గైర్హాజరును కోర్టు అనుమతించింది.
సెబాస్టియన్, మాల్కం టేపర్ తదితరుల క్రాస్ ఎగ్జామినేషన్పై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నందున... ఆ అంశాన్ని పక్కన పెట్టి మిగతా సాక్ష్యులను విచారణ జరపాలని... అనిశా ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేందర్ కోరారు. ఆయన అభ్యర్థనను అంగీకరించిన న్యాయస్థానం జులై 7 నుంచి సాక్ష్యుల విచారణ షెడ్యూలు ఖరారు చేసింది. జులై 8న రేవంత్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి హాజరుకావాలని సమన్లు జారీ చేసింది.
ఇదీ చదవండి: NIA: దర్భంగా పేలుడు కేసులో ఇద్దరు హైదరాబాద్ వాసుల అరెస్టు