అంతర్గత పరీక్షల్లో పాస్ చేయిస్తానంటూ... ఉస్మానియా వైద్యవిద్య కళాశాల సాధారణ వైద్య విభాగం అధిపతి డాక్టర్ బాలాజీ విద్యార్థుల నుంచి లంచాలు స్వీకరించాడనే ఫిర్యాదులతో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. అంబర్‌పేటలోని డీడీ కాలనీలోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహించారు. దాదాపు రూ. 10 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను గుర్తించారు. ఇందుకు సంబంధించిన దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
260 మంది వద్ద నుంచి రూ. 11 లక్షలు
కళాశాల ఇంటర్నల్ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందేలా చూసుకుంటానని చెప్పి ఒక్కో విద్యార్థి నుంచి బాలాజీ 50 నుంచి 60 వేల రూపాయలు వసూలు చేశాడు. ఈ విధంగా 260 మంది నుంచి 11 లక్షల రూపాయలు ఆర్జించాడు. దీనిపై కొందరు విద్యార్థులు ఏసీబీని ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన అధికారులు విచారణ జరిపారు.
ఇదీ చదవండి : 'గెలిపిస్తే జయ మృతి వెనుక రహస్యం కనిపెడతాం'