సీజ్ చేసిన ఒరిజినల్ ఇన్వాయిస్ పేపర్లు ఇచ్చేందుకు లంచం తీసుకుంటుండగా.. ఓ జీఎస్టీ అధికారిని అ.ని.శా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈనెల 6న ఓం ట్రాన్స్‌పోర్ట్‌లో ముంబయి నుంచి హైదరాబాద్ శ్రీ కృష్ణ ట్రేడర్స్‌కు బాదం లోడ్‌తో వస్తోన్న ఓ లారీని సేల్స్ టాక్స్ అధికారి లోడ్ వాల్యూకు సరైన పత్రాలు లేవంటూ.. మెహదీపట్నం పిల్లర్ నెం. 53 వద్ద సీజ్ చేశారు.
స్టేట్ టాక్స్ ఆఫీసర్ కె బిక్షమయ్య లోడ్‌కు సంబంధించిన ఒరిజినల్ ఇన్వాయిస్ పేపర్లు ఇచ్చేందుకు రూ. 60 వేలు డిమాండ్ చేశారు. తాను అంత డబ్బులు ఇవ్వలేనని ట్రాన్స్పోర్ట్ మేనేజర్ దినేశ్ అనగా.. రూ. 35 వేలు ఇవ్వాలని బిక్షమయ్య ఒత్తిడి చేశాడు. కానీ డబ్బులు ఇచ్చేందుకు ఇష్టపడని దినేశ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
నాంపల్లిలోని గగన్ విహార్ కార్యాలయంలో బిక్షమయ్య రూ. 35 వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అధికారిని ఏసీబీ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్లు డీఎస్పీ ప్రతాప్ తెలిపారు.