హైదరాబాద్ ఈఎస్‌ఐలో భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో అనిశా పలువురు అధికారుల ఇళ్లలో తనిఖీలు చేపట్టింది. ఔషధాల కొనుగోలులో రూ.10 కోట్ల మేర స్కాం జరిగిందన్న ఆరోపణలతో సోదాలు నిర్వహించారు. కార్మిక బీమా వైద్య సేవల సంచాలకురాలు దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ, అసిస్టెంట్ డైరెక్టర్ వసంత ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. దేవికారాణి ఇల్లు సహా 23చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. జాయింట్ డైరెక్టర్ పద్మ, అసిస్టెంట్ డైరెక్టర్ వసంత ఇంటితోపాటు ఫార్మాసిస్ట్‌లు ఎం.రాధిక, జ్యోత్స్న, ఫాతిమా, లావణ్య, నాగలక్ష్మి, విశ్రాంత ఫార్మాసిస్ట్ సబితా ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. సీనియర్ అసిస్టెంట్లు సురేంద్రనాథ్, హర్షవర్ధన్, పావని నివాసాల్లోనూ అధికారులు తనిఖీలు చేపట్టారు. రికార్డు అసిస్టెంట్ రాజశేఖర్‌తోపాటు సూపరింటెండెంట్లు సురేష్ అగర్వాల్, వీరన్న, ఆఫీస్ అసిస్టెంట్ శ్రీనివాసరావు, ఎండీ శ్రీధర్, నాగరాజు, సుధాకర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి ఇళ్లలోనూ అనిశా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
ఇవీ చూడండి: పురపాలక ఎన్నికలపై విచారణ రేపటికి వాయిదా...