అనిశా కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ ఈనెల 19కి వాయిదా వేసింది. స్టీఫెన్ సన్ సహా ఐదుగురు ప్రధాన సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్‌ను వాయిదా వేయాలన్న రేవంత్ రెడ్డి పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. అనిశా ప్రధాన విచారణ పూర్తి చేయాలని.. ఆ తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తామని రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది వాదించారు.
వెంట వెంటనే క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని.. పెండింగ్‌లో పెట్టొద్దని అనిశా తరఫు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. ఇరు వైపుల వాదనలు విన్న ఏసీబీ కోర్టు.. నిర్ణయం ఈనెల 19కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: ఏదో ఒక రోజు తెలంగాణకి ముఖ్యమంత్రిని అవుతా: షర్మిల