నోటుకు ఓటు కేసు అనిశా కోర్టు పరిధిలోకి రాదన్న రేవంత్ పిటిషన్పై ఈరోజు విచారణ జరిగింది. ఈ పిటిషన్పై గతంలోనే వాదనలు విన్న న్యాయస్థానం నిర్ణయాన్ని ఈనెల 28కి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.
అయితే రేవంత్ రెడ్డి అభ్యర్థన మేరకు పిటిషన్పై మరిన్ని వాదనలు వినేందుకు న్యాయస్థానం ఇటీవలే అంగీకరించింది. ఇవాళ ఇరువైపులా మరోసారి వాదనలు విన్న న్యాయస్థానం నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈరోజు జరిగిన విచారణకు రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు.