ETV Bharat / state

AC bus shelters: అలంకారప్రాయంగా ఏసీ బస్​షెల్టర్లు.. రెండేళ్లైనా వసతులు కరవు.! - ac bus shelters

గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో ఆర్టీసీ ఏసీ బస్ షెల్టర్లు అలంకార ప్రాయంగా మారిపోయాయి. రెండేళ్లు గడిచినా కనీస మౌలిక వసతులు లేకపోవడంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. సకల సౌకర్యాలు కల్పిస్తామని ఘనంగా చెప్పిన అధికారులు ఆ తర్వాత నిర్వహణను గాలికొదిలేశారు.

AC bus shelters
ఏసీ బస్​ షెల్టర్లు
author img

By

Published : Aug 18, 2021, 8:38 PM IST

హైదరాబాద్​ మహానగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో భాగంగా తెలంగాణ ఆర్టీసీ.. గ్రేటర్ పరిధిలో ఏసీ బస్ షెల్టర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటిని ప్రారంభించే ముందు 24 గంటల పాటు ఏసీ సదుపాయం, తాగునీటి వసతి, ఆధునిక టాయిలెట్లు, ఏటిఎం, బస్ పాస్ కౌంటర్లు, బస్సుల రాకపోకల సమాచారం అన్నీ... ఏర్పాటు చేస్తామని అధికారులు పేర్కొన్నారు. అవి ప్రారంభించి రెండేళ్లు గడిచినా ఇప్పటికీ అలంకారప్రాయంగానే ఉన్నాయి. ఏసీ బస్ షెల్టర్లలో మౌలిక వసతులు లేకపోవడంతో ప్రయాణికులు అనేక అవస్థలు పడుతున్నారు.

దుర్గంధభరితం

రెండేళ్ల క్రితం గ్రేటర్ పరిధిలో కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు, శిల్పారామం, ఖైరతాబాద్​లలో ఏసీ బస్ షెల్టర్లను ఏర్పాటు చేశారు. ఇటీవల దిల్​సుఖ్ నగర్, తార్నాక ప్రాంతాల్లోను వీటిని ఏర్పాటు చేశారు. వీటిని ప్రారంభించే సమయంలో ప్రయాణికులకు పూర్తి భద్రత, 24 గంటల పాటు ఏసీ సదుపాయం, తాగునీటి వసతి, ఆధునిక టాయిలెట్లు, ఏటీఎం, బస్​పాస్‌ కౌంటర్లు, బస్సుల రాకపోకలపైన ముందస్తు సమాచారం వంటి సదుపాయాలతో బస్‌షెల్టర్లను ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఏసీ బస్ షెల్టర్లు మేడిపండు చందంగా మారిపోయాయి. ప్రయాణికులు తాగుదామంటే మంచినీళ్లు అందుబాటులో ఉండవు. సీసీ కెమెరాలు ఉన్నా.. అవి పనిచేయవని ప్రయాణికులు వాపోతున్నారు. ఇక బస్ షెల్టర్లలో కచ్చితంగా ఉండాల్సిన ఎల్.ఈ.డీ బోర్డు అసలే ఏర్పాటుచేయలేదు. దీంతో ఏ బస్సు ఎప్పుడు వస్తుందో తెలియక ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు పేర్కొన్నారు. మరోవైపు ఎలుకలు ఏసీ బస్ షెల్టర్లలో స్వైరవిహారం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

'ఏసీ బస్​ షెల్టర్లలో తాగుదామంటే మంచినీళ్లు అందుబాటులో ఉండవు. నిర్వహణలేమితో ఇక్కడ దుర్గంధం వెదజల్లుతోంది. ఎల్​ఈడీ బోర్డు లేకపోవడంతో ఏ బస్సు ఎప్పుడు వస్తుందో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము.' -రాజేశ్​, ప్రయాణికుడు

పైన పటారం.. లోన లొటారం

బయటి నుంచి చూస్తే ఏసీ బస్ షెల్టర్లు ఆకర్షణీయంగా కన్పిస్తాయి. కానీ లోపలికి వెళ్లి కూర్చుంటేనే అసలు విషయం తెలుస్తుంది. కూకట్‌పల్లి, ఖైరతాబాద్, శిల్పారామం మార్గాల్లో ప్రతి రోజూ వందలకొద్దీ బస్సులు రాకపోకలు సాగిస్తాయి. ఏ బస్సు ఎప్పుడొస్తుందో తెలిపే సమాచారం లేకపోవడంతో ప్రయాణికులు బస్‌ షెల్టర్లలో వాటి కోసం ఎదురుచూడాల్సివస్తుంది. పోనీ.. బస్సు వచ్చే వరకు షెల్టర్లలో కూర్చుందామనుకుంటే.. ఏసీ పనిచేయదు. దీనికి తోడు బస్‌షెల్టర్లలో దుర్గంధం వ్యాపిస్తోందని, వేచి ఉండలేకపోతున్నామని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు బయటకి వచ్చి.. రోడ్డుపైనే పడిగాపులు కాస్తున్నారు.

'బస్సు వచ్చేవరకు లోపల కూర్చుందామంటే ఏసీ పనిచేయదు. దీంతో రోడ్డుపైనే పడిగాపులుగాస్తున్నాం. సీసీ కెమెరాల పనితీరు కూడా సరిగా లేదు. రాత్రివేళల్లో పనిచేయాలంటే భయంభయంగా ఉంది. దయచేసి ఏసీ బస్​ షెల్టర్ల నిర్వహణపై అధికారులు చొరవ తీసుకోవాలి.' సరిత, ప్రయాణికురాలు

మందుబాబులకు అడ్డాగా..

మహిళా ప్రయాణికుల భద్రత దృష్ట్యా సీసీ టీవీలను ఏర్పాటు చేశారు కానీ.. వాటి నిర్వహణ గాలికొదిలేశారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కొందరు మందుబాబులు ఏకంగా బస్ షెల్టర్లలో తిష్ఠ వేస్తున్నారని... వారి వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తుందని మహిళా ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేసే విధంగా చూడాలని కోరుతున్నారు. రాత్రివేళల్లో ప్రయాణం చేయాలంటే భయంగా ఉంటోందని పేర్కొన్నారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ, ఆర్టీసీ అధికారులు సమన్వయం చేసుకుని... ఏసీ బస్ షెల్టర్ల నిర్వహణపై దృష్టిసారించాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

అలంకారప్రాయంగా ఏసీ బస్​షెల్టర్లు

ఇదీ చదవండి: TS Politics: ఈటీవీ భారత్ ప్రత్యేకం... "ధర్మపురి" వారి కుటుంబ కథా చిత్రమ్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.