అభినయ థియేటర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అభినయ నేషనల్ థియేటర్ ఫెస్టివల్-2020ని వర్చువల్ ద్వారా నిర్వహిస్తున్నారు. జాతీయ బహుభాషా నాటకోత్సవాలకు నాటక ప్రియుల నుంచి మంచి స్పందన వస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 25 వరకు నిర్వహిస్తున్న నాటకాల్లో తెలుగు, హిందీ భాషాల్లో జాతీయ స్థాయి నాటకాలను ప్రదర్శిస్తున్నారు.
అందులో భాగంగా ఏకలవ్య థియేటర్ డెహ్రాడూన్ వారి ఆధ్వర్యంలో ఔరంగజేబు హిందీ నాటకం ప్రదర్శించారు. దానికి రచన ఇందిరా పార్థ సారథి, దర్శకత్వం అఖిలేష్ నరేన్ వహించారు. ఔరంగజేబు పాత్రను దర్శకులు అఖిలేష్ పోషించి ఔరా అనిపించారు.
ఇదీ చూడండి : లైంగిక దాడి కేసుల్లో నిందితులకు 20 ఏళ్ల కారాగారం