ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ అంశంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సస్పెన్షన్ ఎత్తివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేసింది ఏపీ ప్రభుత్వం. హైకోర్టు ఆదేశాలపై గతంలో సుప్రీంకోర్టు స్టే విధించింది. విచారణ జరిపిన జస్టిస్ ఏఎం.ఖాన్ విల్కర్ ధర్మాసనం.. పిటిషన్‌పై సమగ్రంగా విచారిస్తామని తెలిపారు. వారం రోజుల గడువు కావాలని ఏపీ ప్రభుత్వం కోరగా.. పిటిషన్‌పై విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది ధర్మాసనం.
సర్వీస్ నిబంధనలు అతిక్రమించి నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను గతంలో విధుల్లో నుంచి తొలగించింది. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న సమయంలో భద్రతా ఉపకరణాలు కొనుగోలులో అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వం వెంకటేశ్వరరావుపై వేటు వేసింది.
ఇదీ చదవండి: పోలీస్ జాగిలాల పాసింగ్ అవుట్ పరేడ్